Cyclone Biparjoy intensifies: మహోగ్రరూపం దాల్చిన బిపర్‌జోయ్ తుపాన్..గుజరాత్‌లో తీరం దాటే అవకాశం
మహోగ్రరూపం దాల్చిన బిపర్‌జోయ్ తుపాన్ గుజరాత్‌లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ సోమవారం వెల్లడించింది. తీవ్రమైన ఈ తుపాన్ గుజరాత్‌లోని కచ్‌లో తీరం దాటే అవకాశం ఉంది.....

Cyclone Biparjoy intensifies
Cyclone Biparjoy intensifies: మహోగ్రరూపం దాల్చిన బిపర్‌జోయ్ తుపాన్ గుజరాత్‌లో తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ సోమవారం వెల్లడించింది. తీవ్రమైన ఈ తుపాన్ గుజరాత్‌లోని కచ్‌లో తీరం దాటే అవకాశం ఉంది. (likely to make landfall in Gujarat) గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ తీరాల్లో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది.అతి తీవ్ర తుఫాను ‘బిపర్‌జోయ్’ నేపథ్యంలో గుజరాత్‌లో ముందుజాగ్రత్త చర్యలు చేపట్టారు.
కాండ్లా పోర్ట్ నుంచి భారీ నౌకలను ఇతర పోర్టులకు తరలించారు. నిన్న 6 నౌకలు తరలించామని, నేడు మరో 11 నౌకలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని పోర్ట్ అధికారులు ప్రకటించారు. నౌకల యజమానులు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ సూచించింది. కాండ్లాలో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను గాంధీధామ్‌కు తరలించారు. తుపాను ముప్పు వల్ల ప్రాణనష్టం వాటిల్లకుండా గుజరాత్ ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది. సహాయక బృందాలను అప్రమత్తం చేసింది.
Telangana governor Tamilisai: గర్భిణులు సుందరకాండ, పురాణాలు పఠించాలి…తెలంగాణ గవర్నర్ తమిళసై సలహా
సోమవారం ఉదయం వెరీ సీవియర్ సైక్లోనిక్ స్టార్మ్ కేటగిరీ నుంచి ఎక్స్‌ట్రీమ్లీ సీవియర్ సైక్లోనిక్ స్టార్మ్ (ESCS)గా బిపర్‌జోయ్ బలపడింది. ఈ తుపాన్ ఈ నెల 15 వతేదీ మధ్యాహ్నం వరకు మాండ్వి (గుజరాత్)- కరాచీ(పాకిస్తాన్) మధ్య తీరం దాటనున్నట్టు వాతావరణ శాఖ అంచనా వేసింది. ఆదివారం రాత్రి ఐఎండీ తన తాజా వెదర్ బులెటిన్‌లో బిపర్‌జోయ్ తుపాను కారణంగా గుజరాత్ రాష్ట్రంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Australia bus crashes: ఆస్ట్రేలియాలో పెళ్లి బస్సు బోల్తా..10 మంది మృతి, మరో 11మందికి తీవ్ర గాయాలు
జూన్ 13న సింధ్ తీర ప్రాంతాలపై తుపాను ప్రభావం చూపే అవకాశం ఉన్నందున పాకిస్థాన్‌లోని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ఎన్‌డిఎంఎ) కూడా సంబంధిత అధికారులను హై అలర్ట్ చేసింది. మహారాష్ట్రలోని ముంబయి నగరంలో ఆదివారం రాత్రి భారీ వర్షంతోపాటు బలమైన గాలులు వీచాయి.