అమరావతిలో పూర్తిగా వారంపాటు లాక్‌డౌన్

అమరావతిలో పూర్తిగా వారంపాటు లాక్‌డౌన్

lockdown

Updated On : February 22, 2021 / 7:13 AM IST

Amravati lockdown: కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి జాగ్రత్తగా ఉండాలని అక్కడి ప్రభుత్వం ఎంత మొత్తుకున్నా… అదే నిర్లక్ష్యంతో వ్యవహరించారు నగర వాసులంతా. దీంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ వ్యాప్తిని అడ్డుకోవడానికి జిల్లా వ్యాప్తంగా పూర్తిగా వారం రోజులు లాక్ డౌన్ ప్రకటించేసింది.

ముందుగా వీకెండ్ లో లాక్ డౌన్ ప్రకటించారు. శనివారం సాయంత్రం 8గంటల నుంచి మళ్లీ సోమవారం ఉదయం 7గంటల వరకూ లాక్ డౌన్ అమలు చేశాయని ప్లాన్ చేశారు. డెసిషన్, గార్డియన్ మినిస్టర్ యశోమతి ఠాకూర్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. జిల్లాలో అచల్ పూర్ సిటీని మినహాయించారు.

మహారాష్ట్రలో శనివారం 6వేల కేసులు నమోదయ్యాయి. ముంబై, అమరావతి మునిసిపల్ కార్పొరేషన్ ఏరియాల్లో రికార్డు స్థాయిలో కేసులు ఫైల్ అయ్యాయి. మొత్తంగా 20లక్షల 93వేల 913కేసులు నమోదయ్యాయని రికార్డులు చెబుతున్నాయి.