National Democratic Alliance : ఎన్డీఏలో చేరిన అఖిలేష్ మాజీ మిత్రుడు ఓపీ రాజ్‌భర్

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అఖిలేష్ యాదవ్ పార్టీకి చెందిన మాజీ నేత ఓపీ రాజ్‌భర్ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ లో చేరారు. ఓపీ రాజ్‌భర్ కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏలో చేరారు....

National Democratic Alliance : ఎన్డీఏలో చేరిన అఖిలేష్ మాజీ మిత్రుడు ఓపీ రాజ్‌భర్

OP Rajbhar meet amith sha

Updated On : July 16, 2023 / 10:41 AM IST

OP Rajbhar : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అఖిలేష్ యాదవ్ పార్టీకి చెందిన మాజీ నేత ఓపీ రాజ్‌భర్ బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ లో చేరారు. ఓపీ రాజ్‌భర్ కు చెందిన సుహెల్‌దేవ్ భారతీయ సమాజ్ పార్టీ 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఎన్డీఏలో చేరారు. ఎస్‌బిఎస్‌పి అధినేత ఓపీ రాజ్‌భర్ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డిఎలో చేరిక లాంఛనప్రాయమేనని ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారు. ( OP Rajbhar joins BJP led NDA)

Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఆరంజ్ అలర్ట్ జారీ

ఓపీ రాజ్‌భర్ (OP Rajbhar) అమిత్ షాను కలిసి మాట్లాడారు. రాజ్‌భార్ జీ రాక ఉత్తరప్రదేశ్‌లో ఎన్డీఏను బలోపేతం చేస్తుందని అమిత్ షా చెప్పారు. ‘‘ నేను కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశాను, 2024 ఎన్నికల్లో మేం కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం. మమ్మల్ని ఎన్డీఏలో చేర్చుకున్నందుకు ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌లకు ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను’’ అని రాజ్‌భర్ చెప్పారు.

South Korea floods : దక్షిణ కొరియాలో వరదలు… 26మంది మృతి

2017వ సంవత్సరంలో జరిగిన ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎస్‌బీఎస్పీ పోటీ చేసింది. ఓం ప్రకాష్ రాజ్‌భర్ 2019 వ సంవత్సరం వరకు యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు. గతంలో కూటమి వ్యతిరేక కార్యకలాపాల కారణంగా తొలగింపునకు గురయ్యారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేసింది. గతేడాది జులైలో ఓం ప్రకాష్ రాజ్‌భర్ ఎస్పీతో పొత్తుకు స్వస్తి పలికారు.