South Korea floods : దక్షిణ కొరియాలో వరదలు… 26మంది మృతి

దక్షిణ కొరియాలో వరద విపత్తు సంభవించింది. దక్షిణ కొరియాలో కురుస్తున్న భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతోపాటు వరదల వల్ల 26 మంది మరణించారు. వరదల్లో మరో పదిమంది గల్లంతు అయ్యారు....

South Korea floods : దక్షిణ కొరియాలో వరదలు… 26మంది మృతి

South Korea floods

South Korea floods : దక్షిణ కొరియాలో వరద విపత్తు సంభవించింది. దక్షిణ కొరియాలో కురుస్తున్న భారీవర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటంతోపాటు వరదల వల్ల 26 మంది మరణించారు. వరదల్లో మరో పదిమంది గల్లంతు అయ్యారు. (landslides kill at least 26) మధ్య, ఆగ్నేయ ప్రాంతాల్లో వరదలు సంభవించాయని, కుండ పోత వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఐదు ఇళ్లు కూలిపోయాయి.

Rajya Sabha seats : రాజ్యసభకు ఆరుగురు టీఎంసీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక

కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఇద్దరు మరణించారని దక్షిణ కొరియా మంత్రిత్వశాఖ తెలిపింది. (South Korea floods) మంగళవారం నుంచి కుండపోత వర్షాల కారణంగా 10 మంది గల్లంతయ్యారని, గురువారం నుంచి మరో 13 మంది గాయపడ్డారని ఆ దేశ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు.

Heavy Rainfall : పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు..ఆరంజ్ అలర్ట్ జారీ

జులై 9 వతేదీ నుంచి కురుస్తున్న అతి భారీవర్షాల వల్ల 5,570 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. (thousands evacuated) భారీవర్షాల వల్ల 25,470 ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 4,200 మంది నిరాశ్రయులను తాత్కాలిక శిబిరాలకు తరలించారు. భారీవర్షాలు, వరదల వల్ల 20 విమాన సర్వీసులు, బుల్లెట్, సాధారణ రైలు సర్వీసులను నిలిపివేశారు. 200 రోడ్లను వరదనీటి ప్రవాహంతో మూసివేశారు.

Flash Floods : జమ్మూకశ్మీరులో మెరుపు వరదలు..కొట్టుకుపోయిన బాలికలు

దక్షిణ కొరియా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఆదివారం సాయంత్రం వరకు భారీ వర్షాలు కురుస్తాయని దక్షిణ కొరియా వాతావరణ సంస్థ తెలిపింది. జులై 9వతేదీ నుంచి గాంగ్జు నగరం, చియోంగ్‌యాంగ్ కౌంటీలో 600 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దక్షిణ కొరియాలోని మధ్య ప్రాంతాల్లోనూ అత్యధిక వర్షపాతం నమోదైంది.