Bus tragedy survivor : బస్సులో తోటి ప్రయాణికులు సజీవంగా దహనమవుతుంటే చూసి, కిటికీ పగులగొట్టి బయపడ్డాను…
మంటలు రాజుకున్న బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడిన వెనుక అద్దాన్ని పగులగొట్టి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నానని ప్రయాణికుడు చెప్పారు. ‘‘బస్సు టైరు పగిలిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి’’ అని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడు చెప్పారు....

Bus tragedy survivor
Bus tragedy survivor : మహారాష్ట్రలో జరిగిన బస్సు దగ్ధం ఘటనలో ప్రాణాలతో బయటపడిన ఓ ప్రయాణికుడు తాను ఎలా బయటపడ్డానో వెల్లడించారు. బుల్దానా జిల్లాలో శనివారం తెల్లవారుజామున 26 మంది ప్రయాణీకుల మరణానికి దారితీసిన బస్సు దగ్థం ఘటన గురించి ప్రత్యక్ష సాక్షి కథనం ఈ విధంగా ఉంది. మంటలు రాజుకున్న బస్సులో నుంచి ప్రాణాలతో బయటపడిన వెనుక అద్దాన్ని పగులగొట్టి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నానని ప్రయాణికుడు చెప్పారు. (Saw people getting burnt alive)
Maharashtra Bus Catches Fire : మహారాష్ట్ర బస్సులో మంటలు..25మంది మృతి
‘‘బస్సు టైరు పగిలిన వెంటనే బస్సులో మంటలు చెలరేగాయి. కొద్దిసేపటికే మంటలు వ్యాపించాయి’’ అని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికుడు చెప్పారు. బుల్దానాలోని సింధ్‌ఖేడ్రాజా సమీపంలో సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వేపై తెల్లవారుజామున 1.30 గంటల ప్రాంతంలో నాగ్‌పూర్ నుంచి పూణే వెళుతున్న ప్రైవేట్ ప్యాసింజర్ బస్సు రోడ్డు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సులో ఉన్న 33 మంది ప్రయాణికుల్లో 26 మంది కాలి బూడిదైనట్లు పోలీసులు తెలిపారు. తన పక్కన కూర్చున్న ప్రయాణీకుడు, తాను వెనుక కిటికీ పగలగొట్టి తప్పించుకోగలిగామని చెప్పాడు. (broke window to get out)
Kenya Road Crash : కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం, 48 మంది మృతి
ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది త్వరితగతిన ఘటనాస్థలికి చేరుకున్నారని ప్రాణాలతో బయటపడిన వ్యక్తి తెలిపారు. నలుగురైదుగురు ప్రయాణికులు బస్సు కిటికీని పగులగొట్టి తప్పించుకున్నారని స్థానికులు తెలిపారు. బస్సు దహనం తర్వాత తాము వెళ్లి చూడగా భయానక పరిస్థితి కనిపించిందని స్థానికులు చెప్పారు.
Neeraj Chopra 5 Fitness Secrets : నీరజ్‌చోప్రా ఫిట్‌నెస్ సీక్రెట్ ఏమిటంటే…
‘‘బస్సు లోపల ఉన్న వ్యక్తులు కిటికీలు పగులగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు సజీవ దహనమవడం మేం చూశాం… మంటలు చాలా తీవ్రంగా ఉన్నాయి, మేం ఏమీ చేయలేక పోయాం,కన్నీళ్లు పెట్టుకున్నాం’’ అని స్థానికుడొకరు చెప్పారు. హైవే గుండా వెళ్లే వాహనాలను సహాయం కోసం నిలిపి ఉంటే, మరింత మంది ప్రాణాలను కాపాడేవారని ఆయన పేర్కొన్నారు.బస్సు ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏడుగురిని సమీపంలోని ఆసుపత్రికి తరలించామని, వారు క్షేమంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.