Encounter: జమ్మూకశ్మీర్ రాజౌరీలో ఎన్‌కౌంటర్…ఉగ్రవాది హతం

Encounter
Encounter : జమ్మూకశ్మీరులో శుక్రవారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతం అయ్యాడు.రాజౌరీ జిల్లాలోని దస్సల్ అటవీప్రాంతంలో(Jammu and kashmir Rajouri) కేంద్ర భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది మరణించాడని(Terrorist killed in Encounter), భద్రతా బలగాలు గాలింపు కొనసాగిస్తున్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి.
గురువారం బారాముల్లా ప్రాంతంలో నిషేధిత లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను అరెస్టు చేసి, ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదుల కదలికల గురించి అందిన కీలక సమాచారంతో ఫ్రెస్టియార్ వారిపొర వద్ద మొబైల్ చెక్ పాయింటు వద్ద పోలీసులు, భద్రతాసిబ్బంది ఆకస్మిక తనిఖీలు చేశారు. పోలీసులను చూసి ఇద్దరు ఉగ్రవాదులు పారిపోతుండగా వారిని పట్టుకున్నారు.
అరెస్టు అయిన ఉగ్రవాదులు సుహైల్ గుల్జార్, వసీం అహ్మద్ గా గుర్తించారు. అరెస్టు అయిన ఉగ్రవాదుల వద్ద నుంచి రెండు చైనీస్ పిస్టళ్లు, పిస్టల్ మ్యాగజైన్లు, లైవ్ రౌండ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జమ్మూకశ్మీరులో ఇటీవల ఉగ్రవాద కార్యకలాపాలు పెరగడంతో భద్రతా బలగాలు అప్రమత్తమై గాలింపు చేపట్టాయి. దీంతో తరచూ ఎదురుకాల్పులు జరుగుతున్నాయి.