International Yoga Day 2023: ప్రపంచ ఉద్యమంగా యోగా మారింది..వీడియో ప్రసంగంలో మోదీ వ్యాఖ్యలు

‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది" అని ప్రధాని మోదీ బుధవారం వీడియో సందేశంలో పేర్కొన్నారు.వసుధైవ కుటుంబం అనే థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగా చేస్తున్నారని ఆయన తెలిపారు.....

International Yoga Day 2023: ప్రపంచ ఉద్యమంగా యోగా మారింది..వీడియో ప్రసంగంలో మోదీ వ్యాఖ్యలు

యోగా చేస్తున్న మోదీ

Updated On : June 21, 2023 / 12:36 PM IST

International Yoga Day 2023: 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం న్యూయార్క్‌లో అద్వితీయమైన యోగా సెషన్‌కు ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వం వహించారు. ఈ యోగా కార్యక్రమంలో ఐక్యరాజ్యసమితి అగ్రశ్రేణి అధికారులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాయబారులు, ప్రముఖ వ్యక్తులు పాల్గొన్నారు. ‘‘అంతర్జాతీయ యోగా దినోత్సవం ద్వారా యోగా ప్రపంచ ఉద్యమంగా మారింది” అని ప్రధాని మోదీ బుధవారం వీడియో సందేశంలో పేర్కొన్నారు.

White House Amid PM Modi Visit: మోదీ అమెరికా పర్యటన సందర్భంగా వైట్‌హౌస్ ఏం చెప్పిందంటే…

వసుధైవ కుటుంబం అనే థీమ్‌తో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది యోగా చేస్తున్నారని ఆయన తెలిపారు.ప్రెసిడెంట్ జో బిడెన్ మరియు ప్రథమ మహిళ జిల్ బిడెన్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ తన మొదటి అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లో ఉన్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జూన్ 21వతేదీన జరుపుకుంటారు.

Welcome Modi uncle:వెల్‌కమ్ మోదీ అంకుల్! ఆటోగ్రాఫ్ ఉన్న పోస్టర్‌తో ఆరేళ్ల చిన్నారి స్వాగతం

యోగా సాధన వల్ల కలిగే వివిధ ప్రయోజనాల గురించి అవగాహన కల్పించేందుకు ఇది ప్రపంచ వేదికగా ఉపయోగపడుతుందని మోదీ వివరించారు. సెప్టెంబరు 2014వ సంవత్సరంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో తన ప్రసంగం సందర్భంగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పాటించాలనే ఆలోచనను మొదటిసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపాదించారు. ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మోదీ నేతృత్వంలో నిర్వహించారు.