North Korea: ఖండాంతర క్షిపణి, 170 రౌండ్ల షెల్స్ ప్రయోగించి కలకలం రేపిన ఉత్తర కొరియా

ఉత్తర కొరియా ఇవాళ తెల్లవారుజామున ఖండాంతర క్షిపణి, 170 రౌండ్ల షెల్స్ ను ప్రయోగించి కలకలం రేపింది. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను వ్యతిరేకిస్తూ కొన్ని రోజులుగా వరుసగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, దక్షిణ కొరియా నుంచి హెచ్చరికలు వస్తున్నప్పటికీ ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలను ఆపడం లేదు. ఇటీవలే అణ్వాయుధ క్షిపణి వ్యవస్థలను కూడా పరీక్షించింది.

North Korea: ఖండాంతర క్షిపణి, 170 రౌండ్ల షెల్స్ ప్రయోగించి కలకలం రేపిన ఉత్తర కొరియా

North Korea's History That 8 Missiles Have Been Fired In A Single Day

Updated On : October 14, 2022 / 10:42 AM IST

North Korea: ఉత్తర కొరియా ఇవాళ తెల్లవారుజామున ఖండాంతర క్షిపణి, 170 రౌండ్ల షెల్స్ ను ప్రయోగించి కలకలం రేపింది. అమెరికా, దక్షిణ కొరియా సైనిక విన్యాసాలను వ్యతిరేకిస్తూ కొన్ని రోజులుగా వరుసగా ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. అమెరికా, దక్షిణ కొరియా నుంచి హెచ్చరికలు వస్తున్నప్పటికీ ఉత్తర కొరియా రెచ్చగొట్టే చర్యలను ఆపడం లేదు. ఇటీవలే అణ్వాయుధ క్షిపణి వ్యవస్థలను కూడా పరీక్షించింది.

ఇవాళ దక్షిణ కొరియా సరిహద్దు వద్ద ఉత్తర కొరియా యుద్ధ విమానాలు కూడా చక్కర్లు కొట్టాయి. సముద్ర తలంపై ఖండాంతర క్షిపణి, 170 రౌండ్ల షెల్స్ ను ఉత్తర కొరియా ప్రయోగించింది. ఈ విషయంపై దక్షిణ కొరియా అధికారులు ప్రకటన చేశారు. సెప్టెంబరు 25 నుంచి ఇప్పటివరకు ఉత్తర కొరియా మొత్తం 15 క్షిపణి పరీక్షలు చేసింది. ఇవాళ ఉదయం పరీక్షించిన క్షిపణి 50 కిలోమీటర్ల ఎత్తు నుంచి 700 కిలోమీటర్ల దూరం వరకు వెళ్లింది.

అమెరికా, ద‌క్షిణ కొరియా సంయుక్త సైనిక‌ విన్యాసాలను కొన‌సాగిస్తూ, త‌మ దేశ‌ ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తూ ఒత్తిడి పెంచితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని ఉత్త‌ర‌కొరియా ఇప్పటికే పలుసార్లు హెచ్చ‌రించింది. అయితే, ఉత్త‌ర కొరియాపై దాడి చేసే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని అమెరికా, ద‌క్షిణ‌కొరియా అంటున్నాయి.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..