North Korea: దీర్ఘ శ్రేణి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణుల పరీక్షలు చేసి మళ్ళీ కలకలం రేపిన ఉత్తర కొరియా

అమెరికా సహా పలు దేశాల నుంచి హెచ్చరికలు వస్తున్నప్పటికీ ఉత్తర కొరియా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉత్తర కొరియా మీడియా ఇవాళ తెలిపిన పలు వివరాలు కలకలం రేపుతున్నాయి. నిన్న ఉత్తర కొరియా దీర్ఘ శ్రేణి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణుల పరీక్షలు చేసిందని, వాటికి అణ్వాయుధాలతో దాడి చేయగలిగే సామర్థ్యం ఉందని పేర్కొంది. ఈ పరీక్షలను తమ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారని తెలిపింది.

North Korea: దీర్ఘ శ్రేణి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణుల పరీక్షలు చేసి మళ్ళీ కలకలం రేపిన ఉత్తర కొరియా

North Korea's History That 8 Missiles Have Been Fired In A Single Day

Updated On : October 13, 2022 / 11:07 AM IST

North Korea: అమెరికా సహా పలు దేశాల నుంచి హెచ్చరికలు వస్తున్నప్పటికీ ఉత్తర కొరియా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఉత్తర కొరియా మీడియా ఇవాళ తెలిపిన పలు వివరాలు కలకలం రేపుతున్నాయి. నిన్న ఉత్తర కొరియా దీర్ఘ శ్రేణి వ్యూహాత్మక క్రూయిజ్ క్షిపణుల పరీక్షలు చేసిందని, వాటికి అణ్వాయుధాలతో దాడి చేయగలిగే సామర్థ్యం ఉందని పేర్కొంది. ఈ పరీక్షలను తమ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యవేక్షించారని తెలిపింది.

తమ దేశం చేసిన పరీక్షలు విజయవంతమయ్యాయని చెప్పింది. అమెరికా, దక్షిణ కొరియా తమకు వ్యతిరేకంగా ఏవైనా చర్యలకు పాల్పడితే తిప్పికొట్టడానికే ఈ పరీక్షలు చేస్తున్నట్లు ఉత్తర కొరియా అంటోంది. అమెరికా, ద‌క్షిణ కొరియా సంయుక్త సైనిక‌ విన్యాసాలను కొన‌సాగిస్తూ ఉత్తర కొరియా ప్ర‌యోజ‌నాల‌కు విరుద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తూ మిల‌ట‌రీ ప‌రంగా ఒత్తిడి పెంచితే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కొంటార‌ని ఇప్పటికే పలుసార్లు ఉత్త‌ర‌ కొరియా హెచ్చ‌రించింది.

నిన్న మూడు గంటలపాటు సముద్ర తలంపై ప్రయోగించిన క్షిపణులు 2,000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా సమర్థంగా ఛేదింగలవని ఉత్తర కొరియా మీడియా పేర్కొంది. ఇప్పటికే ఈ వ్యవస్థను తమ ఆర్మీ యూనిట్ల వద్ద మోహరించినట్లు వివరించింది. అణ్వాయుధాలతో దాడి చేసే వ్యవస్థతో పాటు ఇతర ఆయుధ వ్యవస్థలూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండడంపై కిమ్ ప్రశంసలు కురిపించారని తెలిపింది.

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..