Viral Video: 60 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్‌ను దారుణంగా కొట్టిన ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు యువకులు

ఆ వృద్ధుడితో గొడవ పెట్టుకున్న అయిదుగురూ ఒకేసారి, అందరూ చూస్తుండగా దాడికి దిగారు.

Viral Video: 60 ఏళ్ల ట్యాక్సీ డ్రైవర్‌ను దారుణంగా కొట్టిన ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు యువకులు

Viral Video

Viral Video – USA: వయసు మీద పడినా ఎవరి వద్దా చేయి చాచకుండా కష్టపడి పనిచేసుకుంటున్నాడు ఓ వృద్ధుడు (60). ట్యాక్సీ నడిపిస్తూ, వచ్చిన డబ్బుతో జీవనం కొనసాగిస్తున్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకుని పిడిగుద్దులు కురిపించారు కొందరు. అమెరికాలోని న్యూయార్క్ సిటీ(New York City)లో ఓ ట్యాక్సీ డ్రైవర్ పై ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు దాడి చేశారు.

ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆ వృద్ధుడితో గొడవ పెట్టుకున్న అయిదుగురూ ఒకేసారి అందరూ చూస్తుండగా దాడికి దిగారు. అతడిని బూట్లతోనూ కొట్టారు. దీంతో తన క్యాబ్ పక్కనే ఆ డ్రైవర్ పడిపోయాడు. ఆ అయిదుగురూ కొడుతుంటే తన ముఖానికి దెబ్బలు తగలకుండా ఆ డ్రైవర్ చేసిన ప్రయత్నాలూ విఫలమయ్యాయి.

నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. వృద్ధుడిపై కొంతయినా జాలి లేకుండా ఎందుకు కొట్టారని కొందరు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఇప్పటికే ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఆ వృద్ధుడిని వారు ఎందుకు కొట్టారన్న విషయంపై స్పష్టత లేదు. గత ఏడాది ఆగస్టు 18న 52 ఏళ్ల ఓ ట్యాక్సీ డ్రైవర్ కుటిన్ గైమాను కూడా ఇలాగే కొందరు టీనేజర్లు కొట్టి చంపేశారు.

Bengaluru : సెంట్రల్ ఎక్సైజ్ అధికారిని అంటూ బస్ టికెట్ తీసుకోని మహిళ.. కండక్టర్‌తో వాగ్వాదం.. మండిపడుతున్న నెటిజన్లు