Bengaluru : సెంట్రల్ ఎక్సైజ్ అధికారిని అంటూ బస్ టికెట్ తీసుకోని మహిళ.. కండక్టర్‌తో వాగ్వాదం.. మండిపడుతున్న నెటిజన్లు

ఓ మహిళ బస్సు ఎక్కింది. టికెట్ అడిగిన కండక్టర్‌తో తను సెంట్రల్ ఎక్సైజ్ అధికారిణిని అని చెప్పి ఉచితంగా ప్రయాణించాలని అనుకుంది. కండక్టర్ ఐడీ ప్రూఫ్ అడగటంతో గొడవకు దిగింది. ఇంటర్నెట్ లో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

Bengaluru : సెంట్రల్ ఎక్సైజ్ అధికారిని అంటూ బస్ టికెట్ తీసుకోని మహిళ.. కండక్టర్‌తో వాగ్వాదం.. మండిపడుతున్న నెటిజన్లు

Bengaluru

Bengaluru : బెంగళూరులో ఓ ప్యాసింజర్, బస్ కండక్టర్ మధ్య ఐడీ ప్రూఫ్ కోసం జరిగిన వాగ్వాదం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. తను సెంట్రల్ ఎక్సైజ్ అధికారిని అని చెబుతూ బస్ టికెట్ విషయంలో గొడవ పడిన ఆ మహిళపై నెటిజన్లు మండిపడ్డారు.

Breach of protocol: బెంగళూరు విమానాశ్రయంలో ప్రొటోకాల్ ఉల్లంఘన.. ఏకంగా గవర్నర్‭నే వదిలేసి వెళ్లిన ఎయిర్ ఏషియా విమానం

బస్ కండక్టర్, మహిళ మధ్య కర్ణాటకలో బస్సులో జరిగిన వాగ్వాదం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.  బస్సులో ఉచితంగా ప్రయాణించాలనుకున్న ఓ మహిళ నుంచి కండక్టర్ ఐడీ కార్డు అడిగారు.నాలుగు నిముషాలు రికార్డైన వీడియోలో ఆమెను ఐడీ ప్రూఫ్ అడగుతూ కనిపించింది. అందుకు ఆమె తను సెంట్రల్ ఎక్సైజ్ అధికారిని అని చెబుతుంది. బస్సులోని ప్రయాణికులు కూడా ఆ లేడీని ప్రూఫ్ చూపించమని అడిగారు. అందుకు కట్టుబడని ఆమె వారిపై కేకలు వేయడం మొదలుపెట్టింది. చాలాసేపు బస్‌లోని ప్రయాణికులకు ఆమెకు వాగ్వాదం జరిగింది.  చాలామంది ట్విట్టర్ యూజర్లు మహిళ ప్రవర్తనను విమర్శించారు.

Bengaluru : బెంగళూరు వీధుల్లో డ్రైవర్ లేని కారు .. చూసేందుకు ఎగబడ్డ స్ధానికులు

Ghar Ke Kalesh అనే ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన వీడియోపై ‘కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండి బస్ ఛార్జీల కోసం పోరాడుతున్నారు.. ఈ పథకాలు పేదల కోసం ఉద్దేశించబడ్డాయి’ అని .. ‘ఆమె టికెట్ కోసం చెల్లించకుండా సేవ్ చేసిన దాని కంటే సంఘటనను రికార్డ్ చేయడానికి డేటా ఛార్జీల కోసం ఎక్కువ ఖర్చు చేసి ఉంటుంది’ అని నెటిజన్లు కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.