World Population: మరో 3 రోజుల్లో 800 కోట్లకు చేరుకోనున్న ప్రపంచ జనాభా
1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు మాత్రమే. అయితే 48 ఏళ్లలో జనాభా రెండింతలు పెరిగింది. దీని ప్రకారం.. ప్రతి 12 ఏళ్లలో సుమారు 100 కోట్ల జనాభా పెరిగింది. ఇక మరో 15 ఏళ్లలో అంటే 2037 నాటికి 900 కోట్లకు ప్రపంచ జనాభా చేరుకుంటుందని ఐరాస నివేదిక అభిప్రాయపడింది. 2030 నాటికి 850 కోట్లకు జనాభా చేరుకుంటుందని, 2050 నాటికి 970 కోట్లకు చేరుతుందని, 2080 నాటికి 1040 కోట్లకు చేరుతుందని.. ఇది 2100 వరకు స్థిరంగా ఉంటుందని తెలిపారు.

World population to reach 8 billion on November 15
World Population: నానాటికి పెరిగిపోతున్న ప్రపంచ జనాభా.. మరో మూడు రోజుల్లో అంటే నవంబర్ 15 నాటికి 800 కోట్ల మార్క్‌ను చేరుకోనుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. ప్రజారోగ్యం, పోషకాహారం, వ్యక్తిగత పరిశుభ్రత, ఔషధాల మెరుగుదల కారణంగా మానవ జీవితకాలం క్రమంగా పెరగడం వల్ల ఈ అపూర్వమైన వృద్ధి జరిగిందని ఐరాస ప్రకటించింది. భారత్ వంటి కొన్ని దేశాల్లో అధిక, కొన్ని దేశాల్లో స్థిరమైన సంతానోత్పత్తి స్థాయిల ఫలితంగా జనాభా పెరిగిందట.
ఈ ఏడాది జూలై 11న ప్రపంచ జనాభా దినోత్సవం రోజున ఐరాస ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం విడుదల చేసిన ఐరాస వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2022లో ఈ విషయం వెల్లడైంది. ఇక ఇదే సమయంలో 2023 నాటికి చైనాను అధిగమించి ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని నివేదిక పేర్కొంది. 2050 వరకు అంచనా వేసిన జనాభాలో సగానికిపైగా పెరుగుదల కేవలం ఎనిమిది దేశాల్లోనే కేంద్రీకృతమై ఉంటుందని అంచనా వేసింది. కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండియా, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, టాంజానియా దేశాల్లో జనాభా పెరుగుదల అధికంగా ఉంది.
1974లో ప్రపంచ జనాభా 400 కోట్లు మాత్రమే. అయితే 48 ఏళ్లలో జనాభా రెండింతలు పెరిగింది. దీని ప్రకారం.. ప్రతి 12 ఏళ్లలో సుమారు 100 కోట్ల జనాభా పెరిగింది. ఇక మరో 15 ఏళ్లలో అంటే 2037 నాటికి 900 కోట్లకు ప్రపంచ జనాభా చేరుకుంటుందని ఐరాస నివేదిక అభిప్రాయపడింది. 2030 నాటికి 850 కోట్లకు జనాభా చేరుకుంటుందని, 2050 నాటికి 970 కోట్లకు చేరుతుందని, 2080 నాటికి 1040 కోట్లకు చేరుతుందని.. ఇది 2100 వరకు స్థిరంగా ఉంటుందని తెలిపారు.
1950 నాటి నుంచి విపరీతంగా పెరిగిపోతున్న జనాభా పెరుగుదల తొలిసారిగా 2020లో ఒక శాతం కంటే తక్కువకు పడిపోయినట్లు ఏజెన్సీ పేర్కొంది. ఈ విషయమై ఐక్యరాజ్యసమితి సెక్రటరీ-జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ శుక్రవారం స్పందిస్తూ “మానవ కుటుంబం పెద్దదయ్యే కొద్దీ మరింతగా విభజించబడుతోంది” అని అన్నారు. అప్పులు, కష్టాలు, యుద్ధాలు, వాతావరణ విపత్తుల కారణంగా బిలియన్ల మంది ఎంతగానో కష్టపడుతున్నారని, వందల మిలియన్ల మంది ఆకలిని ఎదుర్కొంటున్నారని, ఉపశమనం కోసం రికార్డు సంఖ్యలో ఇంటికి పారిపోతున్నారని ఆయన పేర్కొన్నారు.