Himachal Pradesh Polls: హిమాచల్ ప్రదేశ్‭లో ముగిసిన పోలింగ్.. రికార్డుపై బీజేపీ, పోయింది పొందడంపై కాంగ్రెస్ విశ్వాసం

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. బీజీపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 412 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 388 పురుష అభ్యర్థులు కాగా 24 మంది మహిళా అభ్యర్థులు. గత ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలతో అధికారాన్ని సాధించుకోగా.. కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలకు పడిపోయి అధికారాన్ని కోల్పోయింది

Himachal Pradesh Polls: హిమాచల్ ప్రదేశ్‭లో ముగిసిన పోలింగ్.. రికార్డుపై బీజేపీ, పోయింది పొందడంపై కాంగ్రెస్ విశ్వాసం

Himachal Voting Ends, BJP Aims For Historic 2nd Term, Congress Eyes Comeback

Himachal Pradesh Polls: హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల పోలింగ్ ముగిసింది. శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్.. కట్టుదిట్టమైన భద్రత నడుమ సాయంత్రం 5:30 గంటలకు ముగిసింది. అయితే కొంత మంది ఓటు హక్కు వినియోగించుకోక పోవడంతో సమయం ముగిసిన అనంతరం కూడా ఓటు వేసేందుకు అనుమతి ఇస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 65.5 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది.

అయితే ఈ ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారం నిలబెట్టుకోవాలని అధికార భారతీయ జనతా పార్టీ ఊవిళ్లూరుతోంది. కాగా 2017లో కోల్పోయిన అధికారాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ప్రస్తుతం పోలింగ్ ముగియడంతో అధికారంలోకి రావడం పట్ల ఎవరి అంచనాల్లో వారు ఉన్నారు. ప్రతి ఎన్నికకు కాంగ్రెస్, బీజేపీ మధ్య అధికార మార్పిడి జరుగుతోంది. ఈసారి దాన్ని బ్రేక్ చేసి వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే విశ్వాసంలో భారతీయ జనతా పార్టీ ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ సంప్రదాయం ప్రకారం.. ఈసారి ఓటర్లు తమకే అధికారం కట్టబెడతారనే విశ్వాసంలో కాంగ్రెస్ పార్టీ ఉంది.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీలోని 68 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ ముగిసింది. బీజీపీ, కాంగ్రెస్, ఆప్, బీఎస్పీ సహా ఇతర పార్టీలు, స్వతంత్రులు కలిపి మొత్తం 412 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు. వీరిలో 388 పురుష అభ్యర్థులు కాగా 24 మంది మహిళా అభ్యర్థులు. గత ఎన్నికల్లో బీజేపీ 44 స్థానాలతో అధికారాన్ని సాధించుకోగా.. కాంగ్రెస్ పార్టీ 21 స్థానాలకు పడిపోయి అధికారాన్ని కోల్పోయింది. ఇక సీపీఎం ఒకటి, స్వతంత్రులు రెండు స్థానాలు గెలుచుకున్నారు. ఈరోజు నిర్వహించిన పోలింగ్ ఫలితాలు డిసెంబర్ 8న విడుదల అవుతాయి.

Rajiv Gandhi Assassination: 31 ఏళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైన రాజీవ్ హంతకులు నళిని, ఇతరులు