ఏప్రిల్‌లో 3రోజులు ఒకే లైన్లోకి బుధుడు, శని, గురుడు, చంద్రుడు

కరోనా వైరస్ మహమ్మారి పుణ్యమా అని కాలుష్య స్థాయి మాత్రం జీరోకు పడిపోయింది. వందల సంవత్సరాల తర్వాత స్వచ్ఛమైన గాలి వాతావరణంలో నిండుకుంది. ఫలితంగా ఆకాశం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదే సమయంలో టెలిస్కోప్ లేదా బైనాక్యూలర్స్‌తో ఓ అరుదైన చూడొచ్చు. కొద్దిరోజుల ముందు ఏర్పడిన పింక్ సూపర్ మూన్ లా కాకుండా ఈ సారి మరింత స్పష్టమైన వాతావరణం ద్వారా చూడొచ్చన్నమాట.
గురుడు, శని, బుధుడు, చంద్రుడు ఒకే లైన్ మీదకు రానున్నారు. ఏప్రిల్ 14, 15, 16తేదీల్లో ఈ అద్భుతాన్ని చూడొచ్చు. గురుడు(Jupiter), శని (Saturn), బుధుడు (Mars) ఉదయం కనిపించే గ్రహాలు వీటిని చూడటానికి ఇబ్బంది లేదు. సరిగ్గా ఏప్రిల్ నెల మధ్యలో ఇవి మూడు కలిసి చంద్రుడు ఉండే లైన్లోనే ఒక దాని వెనుక మరొకటి నిలుస్తాయి. ఇవి అమెరికాలో ఉన్నవారికి స్పష్టంగా కనిపిస్తాయని నాసా అంటుంది.
ఒకవేళ చూడలేకపోతే ప్రత్యేకమైన యాప్ ల సహాయంతో రాత్రి ఆకాశంలో వాటిని కనుగొనవచ్చు. ఈ 3రోజులు మిస్సయితే మళ్లీ వీటిని 2022లోనే చూడగలం. ఇంతేకాకుండా ఈ రోజుల్లో శుక్రుడు (Venus) మిగిలిన నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా కనిపిస్తాడు. దాంతో మనం చాలా సులువుగా గుర్తించవచ్చు.
కాలుష్యం లేని సమయం కాబట్టి.. మన ఇంటి బాల్కనీలో నుంచి లేదా టెర్రస్ మీద నుంచి బైనాక్యులర్స్ తో చూడొచ్చు. నక్షత్రాలను రోజూ చూస్తున్నాం కానీ, గ్రహాలను కూడా ఇంటి దగ్గర్నుంచి చూడటం ఇదే మొదటిసారి కావొచ్చు ప్రజెంట్ జనరేషన్‌కు.