వస్తున్నా : మళ్లీ విధుల్లోకి బోరిస్ జాన్సన్

  • Published By: madhu ,Published On : April 27, 2020 / 01:21 AM IST
వస్తున్నా : మళ్లీ విధుల్లోకి బోరిస్ జాన్సన్

Updated On : April 27, 2020 / 1:21 AM IST

బ్రిటీష్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ మళ్లీ విధులు నిర్వర్తించేందుకు రెడీ అవుతున్నారు. 2020, ఏప్రిల్ 27వ తేదీ సోమవారం నుంచి ఆయన విధులకు హాజరు కానున్నారు. ఇంతకాలం కరోనా వైరస్ కారణంగా ఆయన చికిత్స తీసుకున్న సంగతి తెలిసిందే. కొన్ని రోజుల పాటు క్వారంటైన్ లో ఉండి చికిత్స తీసుకున్నారు. పూర్తిగా కొలుకున్న తర్వాత..విధుల్లోకి హజరు కావాలని నిర్ణయం తీసుకున్నారు.

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో బోరిస్ తిరిగి పగ్గాలు చేపట్టడం దేశానికి చాలా మంచిదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. బోరిస్ విధులకు దూరంగా ఉన్న సమయంలో ప్రధానిగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డొమినిక్ రాబ్ వ్యవహరించారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా రాకాసి విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ కూడా వైరస్ సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన వెల్లడించారు.

దీంతో తాను క్వారంటైన్ లోకి వెళుతున్నట్లు వెల్లడించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, కొన్ని రోజుల క్వారంటైన్ పూర్తయ్యిందని ఆయన వెల్లడించారు. ఇంకా స్వల్పంగా  
వైరస్ లక్షణాలు ఇంకా ఉన్నట్లు, శరీరంలో టెంపరేచర్స్ ఉందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం..వ్యాధి పూర్తిగా తగ్గేంత వరకు క్వారంటైన్ లోనే ఉంటానని జాన్సన్ అన్నారు. కానీ అనూహ్యంగా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తలు వెలువడ్డాయి. ఐషీయూకి తరలించి చికిత్స అందించారు. చివరకు కరోనాను జయించి మళ్లీ విధుల్లోకి చేరుతున్నారు బోరిస్.