Texas : గురు పూర్ణిమ సందర్భంగా ఒకే చోట భగవద్గీత పఠించిన 10 వేలమంది ప్రజలు

గురు పూర్ణిమ సందర్భంగా టెక్సాస్ భక్తి భావంలో మునిగిపోయింది. 10 వేలమంది ఒకే చోట చేరి భగవద్గీత పఠించారు. యోగా, సంగీత ట్రస్ట్ అమెరికా, ఎస్‌జీఎస్ గీతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం వేడుకగా జరిగింది.

Texas : గురు పూర్ణిమ సందర్భంగా ఒకే చోట భగవద్గీత పఠించిన 10 వేలమంది ప్రజలు

Texas

Updated On : July 4, 2023 / 5:31 PM IST

Texas Guru Purnima : గురు పూర్ణిమం సందర్భంగా టెక్సాస్ ఆధ్మాత్మికతను సంతరించుకుంది. ఒకే చోట 10 వేల మంది కలిసి భగవద్గీత (Bhagavad Gita) పఠించారు. యోగా (Yoga), సంగీత ట్రస్ట్ అమెరికా, ఎస్‌జీఎస్ గీతా ఫౌండేషన్ (SGS Geeta Foundation) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కన్నులపండుగలా సాగింది.

Bhagavad Gita : అద్భుతం.. దొంగలో మార్పు తెచ్చిన భగవద్గీత.. 9 ఏళ్ల క్రితం చోరీ చేసిన కృష్ణుడి ఆభరణాలు తిరిగిచ్చేశాడు

టెక్సాస్‌లోని అలెన్ ఈస్ట్ సెంటర్‌లో గురు పూర్ణిమ సందర్భంగా భగవద్గీతా పారాయణం జరిగింది. యోగా సంగీత ట్రస్ట్ అమెరికా, ఎస్‌జీఎస్ గీతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ సమక్షంలో ఈ పారాయణం జరిగింది. ఈ కార్యక్రమంలో 4 నుంచి 84 సంవత్సరాల మధ్య వయస్సులో ఉన్న 10,000 మంది భగవద్గీత పఠించారు. గురు పూర్ణిమ రోజు గురువులను పూజించడం, వారికి కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వచనాలు తీసుకోవడం సంప్రదాయం. గురువును భగవంతుడిలా భావిస్తారు. ఈరోజున వ్యాస మహర్షి జన్మించారని నమ్ముతారు. ఆయన గురు పూర్ణిమ రోజు బ్రహ్మ సూత్రాలను రాయడం ప్రారంభించారని చెబుతారు.

Gita GPT vs ChatGPT: భగవద్గీత స్ఫూర్తితో ChatGPT వంటి చాట్ బాట్ అభివృద్ధి చేసిన బెంగళూరు వ్యక్తి

ఇక గురు పూర్ణిమ రోజున బౌద్ధులు బుద్ధుడు తన మొదటి ఉపన్యాసాన్ని అందించిన రోజుగా భావిస్తారు. ఎంతో శుభకరమైన ఈరోజున టెక్సాస్ మొత్తం భక్తిభావంలో మునిగిపోయింది. గీతా పఠనంతో మారుమోగింది.