Most Famous Bridges: ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన 15 బ్రిడ్జిలు ఇవి..

వంతెనలు.. దూరాన్ని తగ్గిస్తూ, మన ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తుంటాయి. రామాయణ కాలం నుంచి వారధుల ప్రస్తావన ఉంది. రావణుడితో యుద్ధం చేయడానికి వానరులతో కలిసి శ్రీరాముడు వారధి కట్టాడని హిందువులు నమ్ముతారు. వంతెనలు నిర్మించడమన్నది పురాతన కాలం నుంచి ఉంది. మెసొపొటేమియా నాగరికత కాలంలోనూ వంతెనలు వాడారని ఆధారాలు ఉన్నాయి. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన బ్రిడ్జిల గురించి తెలుసుకుందాం..

Most Famous Bridges: ప్రపంచంలో అత్యంత ప్రసిద్ధి చెందిన 15 బ్రిడ్జిలు ఇవి..

Updated On : October 14, 2022 / 5:18 PM IST

Most Famous Bridges: వంతెనలు.. దూరాన్ని తగ్గిస్తూ, మన ప్రయాణాన్ని మరింత సుఖమయం చేస్తుంటాయి. రామాయణ కాలం నుంచి వారధుల ప్రస్తావన ఉంది. రావణుడితో యుద్ధం చేయడానికి వానరులతో కలిసి శ్రీరాముడు వారధి కట్టాడని హిందువులు నమ్ముతారు. వంతెనలు నిర్మించడమన్నది పురాతన కాలం నుంచి ఉంది. మెసొపొటేమియా నాగరికత కాలంలోనూ వంతెనలు వాడారని ఆధారాలు ఉన్నాయి.

బ్రిడ్జిలు ఉంటే విమానాలు, నౌకలు వినియోగించకుండానే బస్సు, కారు, ద్విచక్ర వాహనం వంటి వాటిపై కూర్చొని ఎంచక్కా సముద్రాలు, నదులు దాటేయవచ్చు. ప్రస్తుతం ప్రపంచంలో ఎంతో పొడవైన బ్రిడ్జిలు ఉన్నాయి. వాటి నిర్మాణాలను అత్యద్భుతంగా చేపట్టారు. పర్యాటకులను ఆకర్షించడానికి, దేశం గొప్పదనాన్ని చాటుకోవడానికి కూడా నేటి కాలంలో అత్యంత పొడవైన, ఎత్తైన బ్రిడ్జిలు నిర్మిస్తున్నారు. వీటి ద్వారా వందలాది కిలోమీటర్ల మేర ప్రయాణించొచ్చు.

ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన బ్రిడ్జిల గురించి తెలుసుకుందాం..

దన్యాంగ్-కున్షన్ గ్రాండ్ బ్రిడ్జి


ప్రపంచంలోనే అత్యంత పొడవైన బ్రిడ్జి ఇదే. చైనా దీన్ని నిర్మించింది. 2011, జూన్ 30న దీన్ని ప్రారంభించారు. చైనా రోడ్ అండ్ బ్రిడ్జి కార్పొరేషన్ దీన్ని డిజైన్ చేసింది. 2006లో దీని నిర్మాణాన్ని ప్రారంభించారు. 2010లో నిర్మాణం పూర్తయింది. ఈ బ్రిడ్జి నిర్మాణానికి చైనా 70 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ బ్రిడ్జి 164.8 కిలోమీటర్ల పొడవు ఉంటుంది.

గ్రేట్ బెల్ట్ బ్రిడ్జి


డానిష్ ద్వీపం, డెన్మార్క్ లోని జీలాండ్, ఫునెన్ ను జలసంధిని కలుపుతూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. దీని పొడవు 6,790 మీటర్లు.

చాపెల్ బ్రిడ్జి..

ఇది స్విట్జర్లాండ్ లో ఉంటుంది. దీని పొడవు 204.7 మీటర్లు. మధ్య స్విట్జర్లాండ్ లో ర్యూస్ నదిపై దీన్ని నిర్మించారు. ఇది పురాతన బ్రిడ్జి. క్రీస్తుశకం 1360లో నిర్మించగా దీన్ని 1993లో కూల్చి వేసి, ఆ తదుపరి ఏడాది మళ్ళీ నిర్మించారు.

చెంగ్యాంగ్ బ్రిడ్జి


చెంగ్యాంగ్ బ్రిడ్జిని చైనాలో 1916లో నిర్మించారు. లింక్సి నదీపై ఉన్న ఈ వంతెనను ఇప్పటికీ బాగా వాడుతున్నారు. చెంగ్యాంగ్ వంతెన 64.4 మీటర్ల పొడవు ఉంటుంది.

బ్రూక్లిన్ వంతెన


బ్రూక్లిన్ వంతెన నిర్మాణం 1883లో పూర్తయింది. అమెరికాలోని న్యూయార్క్ లో ఉంటుంది. 6,016 అడుగుల పొడవు (1,833.7 మీటర్లు) ఉంటుంది.

అల్కాంటారా వంతెన


స్పెయిన్ లో ఈ బ్రిడ్జి నిర్మాణాన్ని క్రీస్తు శకం 104లో ప్రారంభించి క్రీ.శ 106లో పూర్తి చేశారు. దీని పొడవు 181.7 మీటర్లు.

సిడ్నీ హార్బర్ వంతెన


సిడ్నీ హార్బర్ బ్రిడ్జి ఆస్ట్రేలియాలో ఉంటుంది. దీని పొడవు 1,149 మీటర్లు. దీన్ని 1932లో ప్రారంభించారు.

స్టారీ మోస్ట్ బ్రిడ్జి


స్టారీ మోస్ట్ బ్రిడ్జిని బోస్నియా-హెర్జెగోవినా దేశంలో 1566లో నిర్మించారు. 1993లో కూల్చివేసి, తిరిగి కట్టి 2004లో ప్రారంభించారు.

సీ-ఓ-సే పొల్


సీ-ఓ-సే పొల్ బ్రిడ్జిని ఇరాన్ లో 1602లో నిర్మించారు. 297.76 మీటర్ల పొడవు ఉంటుంది.

అకాషి-కైక్యో వంతెన


అకాషి-కైక్యో బ్రిడ్జిని జపాన్ లో 1998లో నిర్మించారు. ఇది 3,911 మీటర్ల పొడవు ఉంటుంది.

రియాల్టో వంతెన


రియాల్టో బ్రిడ్జిని ఇటలీలో 1591లో నిర్మించారు. దీని పొడవు 31.80 మీటర్లు ఉంటుంది.

టవర్ బ్రిడ్జి


టవర్ బ్రిడ్జిని 1894లో లండన్ లో నిర్మించారు. 240 మీటర్ల పొడవు ఇది ఉంటుంది.

మిల్లౌ వంతెన


మిల్లౌ వంతెనను దక్షిణ ఫ్రాన్స్ లో 2004లో ప్రారంభించారు. మొత్తం 2,460 మీటర్ల పొడవు ఉంటుంది.

గోల్డెన్ గేట్ బ్రిడ్జి


గోల్డెన్ గేట్ బ్రిడ్జిని అమెరికాలో 1937లో నిర్మించారు. ఇది 2,737.1 మీటర్ల పొడవు ఉంటుంది.

పొంటె విచ్చియో బ్రిడ్జి


పొంటె విచ్చియో అంటే పాత వంతెన అని అర్థం. 30 మీటర్ల పొడవు ఉంటుంది. దీన్ని ఇటలీలో నిర్మించారు. రోమన్ల కాలంలో ఈ బ్రిడ్జిని మొదటిసారి నిర్మించారు.