Afghan Car Bomb Blast ఆఫ్ఘనిస్తాన్‌లో కారు బాంబు దాడి.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు

ఆఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్‌‌లో కారు బాంబు దాడి జరిగింది. ఈ బాంబుదాడిలో ఇద్దరు పౌరులు మృతిచెందగా, ఒక భద్రతా సిబ్బంది సహా 10మందికి గాయాలయ్యాయి.

Afghan Car Bomb Blast ఆఫ్ఘనిస్తాన్‌లో కారు బాంబు దాడి.. ఇద్దరు మృతి, 10 మందికి గాయాలు

2 Killed, 10 Wounded In Car Bomb Blast In Afghanistan's Jalalabad

Updated On : June 2, 2021 / 11:11 PM IST

Afghan Car Bomb Blast : ఆఫ్ఘనిస్తాన్‌లోని జలాలాబాద్‌‌లో కారు బాంబు దాడి జరిగింది. ఈ బాంబుదాడిలో ఇద్దరు పౌరులు మృతిచెందగా, ఒక భద్రతా సిబ్బంది సహా 10మందికి గాయాలయ్యాయి. తూర్పు ప్రావిన్స్ రాజధాని జలాలాబాద్‌లో ఉగ్రవాదులు సైనిక కాన్వాయ్‌లో కారు బాంబును పేల్చారని స్థానిక ప్రభుత్వ ప్రతినిధి ధృవీకరించారు.

రద్దీగా ఉన్న రహదారి దగ్గర స్థానిక సమయం ఉదయం 10:10 గంటలకు కారు బాంబు పేలుడు సంభవించింది, జాతీయ గూఢాచార సంస్థ ప్రత్యేక ఆపరేషన్ దళాలకు చెందిన ఒక కాన్వాయ్ ఈ ప్రాంతం గుండా వెళుతోందని ప్రతినిధి అట్టాహుల్లా ఖోగియాని వెల్లడించారు. బాంబు దాడిలో గాయపడిన క్షతగాత్రులను జలాలాబాద్‌లోని ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి ఇప్పటివరకు ఏ ఉగ్రవాద గ్రూపు బాధ్యత వహించలేదు.

ఇటీవలే జాతీయ రాజధాని కాబూల్ పశ్చిమ భాగంలో రెండు బస్సులపై బాంబుల దాడి జరిగింది. ఈ దాడిలో ఎనిమిది మంది పౌరులు మరణించగా.. మరో 14 మంది గాయపడ్డారు.