Covid-19 New Variants : మ‌రో రెండు ఒమిక్రాన్ వేరియంట్లను గుర్తించిన పరిశోధకులు

మ‌రో రెండు ఒమిక్రాన్ వేరియంట్లను పరిశోధకులు గుర్తించారు.

Covid-19 New Variants : మ‌రో రెండు ఒమిక్రాన్ వేరియంట్లను గుర్తించిన పరిశోధకులు

Corona New Variants In South Africa

Updated On : April 13, 2022 / 11:08 AM IST

corona new variants in south africa : రెండేళ్లకు పైగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహామ్మారి పీడ కొనసాగుతునే ఉంది. కొత్త కొత్త వేరియంట్లుగా రూపాంతరం చెంది ఎప్పటికప్పుడు తన ఉనికిని చాటుకుంటునే ఉంది. ఇటీవల కొంత కాలంలో కోవిడ్ వైరస్ దూకుడు తగ్గింది కదానుకుంటే మరో కొత్త వేరియంట్లుగా పుట్టుకొస్తు హడలెత్తిస్తునే ఉంది. గతంలో డెల్టా వేరియంట్..ఒమిక్రాన్ అంటూ భయపెట్టిన కోవిడ్ మహమ్మారి మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్లుగా మారింది. ఈ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. ద‌క్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన‌ బీఏ.4, బీఏ.5 వేరియంట్లను పరిశోధకులు గుర్తించారు.

ఇప్ప‌టికే ఒమిక్రాన్ స‌బ్ వేరియంట్ బీఏ.2 విజృంభిస్తోన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు పలు దేశాల్లో మరో రెండు ఒమిక్రాన్ వేరియంట్లు పుట్టుకొచ్చాయి. ద‌క్షిణాఫ్రికాలో బీఏ.4, బీఏ.5 వేరియంట్లను ప‌రిశోధ‌కులు గుర్తించారు. అలాగే ఆ వేరియంట్లకు సంబంధించి మరి కొన్ని దేశాల్లోనూ ఇప్పటికే ప‌దుల సంఖ్య‌లో కేసులు నమోదయ్యాయి.

Also read : AP Govt: రేషన్ బియ్యం వద్దంటే డబ్బులు.. మే నుంచి ఏపీలో నగదు బదిలీ పథకం

ఇప్ప‌టికే ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తోన్న బీఏ.2 వేరియంట్‌లాగే బీఏ.4, బీఏ5 స్పైక్‌ ప్రొఫైల్‌ను కలిగి ఉన్నాయని దక్షిణాఫ్రికా ప‌రిశోధ‌కులు తెలిపారు. ద‌క్షిణాఫ్రికాలో పుట్టుకొచ్చిన ఆ వేరియంట్లు ఇప్ప‌టికే బోట్స్‌వానా, బెల్జియం, జర్మనీ, డెన్మార్క్‌తో, బ్రిటన్‌లోనూ వ్యాప్తి చెందాయ‌ని వెల్లడించారు పరిశోధకులు.

దక్షిణాఫ్రికాలో ఈ కొత్త వేరియంట్ల కేసులు క్రమంగా పెరుగుతున్నప్ప‌టికీ వాటి వ‌ల్ల ఆసుప‌త్రుల్లో చేరడం, మృతి చెంద‌డం వంటి కేసులు అంత‌గా లేవ‌ని, ఈ వేరియంట్ల‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇది కొంతవరకు సంతోషదాయమకే అయినా జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవరం ఎంతైనా ఉంది. బీఏ.4, బీఏ5లోని స్పైక్‌ ప్రొటీన్‌ డెల్టా, కప్పా, ఎప్సిలాన్‌ వేరియంట్లలో ఉన్నదేనని తెలిపారు. ఆ వేరియంట్లు రోగనిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకోగ‌ల‌వా? అన్న విష‌యంపై ప‌రిశోధ‌న చేస్తున్న‌ట్లు చెప్పారు.

Also read : Indian Student: కెనడాలో ఇండియన్ స్టూడెంట్ హత్య

ఈ వేరియంట్లు నిర్ధారణ అయిన బాధితులందరూ ఇప్ప‌టికే వ్యాక్సిన్‌ తీసుకున్నవారేనని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చిన క్రమంలో భార‌త ఆరోగ్య శాఖ కూడా అప్రమత్తమైంది. ఇప్ప‌టికే భార‌త్‌లో బయటపడిన ‘ఎక్స్‌ఈ’ వేరియంట్‌పై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి, కొత్త వేరియంట్ల‌పై ఎప్పటికప్పుడు పర్యవేక్షణతో పాటు కేసులపై నిఘా పెంచాలని తెలిపారు. క‌రోనా చికిత్సకు అవసరమైన ఔషధాల లభ్యతపై ఎప్ప‌టిక‌ప్పుడు సమీక్ష చేసుకోవడంతో పాటు వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగ‌వంతం చేయాల‌ని అధికారుల‌కు సూచించారు.