Viral News: 91ఏళ్ల వృద్ధురాలిని హనీమూన్‌కు తీసుకెళ్లిన యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే?

అర్జెటీనాకు చెందిన 23ఏళ్ల యువకుడు తన తల్లి, సోదరుడితో ఉంటున్నాడు. అతని తండ్రి కొద్దికాలం క్రితమే చనిపోయాడు..

Viral News:  91ఏళ్ల వృద్ధురాలిని హనీమూన్‌కు తీసుకెళ్లిన యువకుడు.. పోలీసులు ఏం చేశారంటే?

23 Year Old Boy Married To 91 Year Old Woman

Updated On : November 24, 2024 / 11:26 AM IST

Argentina: వృద్ధురాలి వయస్సు 91ఏళ్లు.. యువకుడి వయస్సు మాత్రం 23 ఏళ్లు. వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఇటీవల కాలంలో హనీమూన్ కి వెళ్లారు. హనీమూన్ లో ఉన్నట్లుండి వృద్ధురాలైన భార్య చనిపోయింది. దీంతో ఆ యువకుడు ఆమెను ఇంటికి తీసుకెళ్లి అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. ఈ తరువాత భార్య పెన్షన్ కోసం ఆ యువకుడు దరఖాస్తు చేసుకోగా.. పోలీసులు షాకిచ్చారు. అతనిపై కేసు నమోదు చేశారు. ఆ కేసు నుంచి చాకచక్యంగా యువకుడు బయటపడ్డాడు. కానీ, పెన్షన్ ఇచ్చేందుకు అధికారులు ససేమీరా అన్నారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

Also Read: Elon Musk : భార‌త్‌ను చూసి నేర్చుకోవాలి..! ఇండియాపై ఎలాన్ మస్క్ ప్రశంసలు.. ఎందుకంటే?

అర్జెటీనాకు చెందిన 23ఏళ్ల యువకుడు తన తల్లి, సోదరుడితో ఉంటున్నాడు. అతని తండ్రి కొద్దికాలం క్రితమే చనిపోయాడు. దీంతో వారు కడుపేదరికంలో జీవిస్తున్నారు. యువకుడు చదువుకునేందుకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన ఒంటరి 91ఏళ్ల వృద్ధురాలు తనను పెళ్లి చేసుకుంటే మీ కుటుంబం బాగోగులతోపాటు నీ చదువుకు అయ్యే ఖర్చును భరిస్తానని చెప్పింది. అంతేకాక తన మరణం తరువాత నా భర్తగా ఆస్తి నీకే వస్తుందని, పెన్షన్ కూడా వస్తుందని చెప్పింది. దీంతో ఆ యువకుడు, కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోవడంతో పెళ్లి తంతు పూర్తయ్యింది. పెళ్లి తరువాత వారు హనీమూన్ కు వెళ్లారు. ఓ హోటల్ గదిలో ఉండగా బెడ్ పైనే వృద్ధురాలు మరణించింది. ఆ తరువాత వృద్ధురాలిని ఇంటికి తీసుకొచ్చి అంతి సంస్కారాలు నిర్వహించారు. భార్య పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోగా పోలీసులు ఆ యువడిపై కేసు నమోదు చేశారు.

 

వృద్ధురాలిని యువకుడే హత్యచేశాడనే అనుమానంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. ఆ యువకుడు న్యాయపోరాటం ద్వారా వృద్ధురాలైన తన భార్యది సహజ మరణం అని రుజువులతో సహా నిరూపించాడు. దీంతో జైలు శిక్ష నుంచి తప్పించుకున్నాడు. అయితే, అధికారులు మాత్రం ఆ యువకుడికి పెన్షన్ డబ్బులు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఇందుకు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.