China Severe Floods : చైనాలో తీవ్రమైన వరదలు…29 మంది మృతి, 16 మంది గల్లంతు

చైనా దేశంలో తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. హెబీ ప్రాంతంలో వెల్లువెత్తిన వరదల్లో 29 మంది మరణించగా, మరో 16 మంది గల్లంతు అయ్యారు. బీజింగ్ నగరంలో గత నెలాఖరున సంభవించిన తుపాన్ వల్ల 33 మంది మరణించారు....

China Severe Floods : చైనాలో తీవ్రమైన వరదలు…29 మంది మృతి, 16 మంది గల్లంతు

China Severe Floods

Updated On : August 11, 2023 / 11:12 AM IST

China Severe Floods : చైనా దేశంలో తుపాన్ ప్రభావం వల్ల కురుస్తున్న భారీవర్షాలతో వరదలు వెల్లువెత్తాయి. హెబీ ప్రాంతంలో వెల్లువెత్తిన వరదల్లో 29 మంది మరణించగా, మరో 16 మంది గల్లంతు అయ్యారు. బీజింగ్ నగరంలో గత నెలాఖరున సంభవించిన తుపాన్ వల్ల 33 మంది మరణించారు. గత వారం ఈశాన్య జిలిన్ ప్రావిన్స్‌లో కుండపోత వర్షం కారణంగా 12 మందికి పైగా ప్రజలు మరణించారు. (China Severe Floods)

Pakistan : సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ కాల్పులు..చొరబాటుదారుడి హతం

చైనాలో ఇటీవల కొద్ది వారాల్లో రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. రాజధానికి సరిహద్దుగా ఉన్న హెబీలోని (Hebei) కొన్ని ప్రాంతాల్లో వీధులు ఇప్పటికీ బురదలో ఉన్నాయి. స్థానికులు నీటమునిగిన వస్తువులను వెలికితీయడానికి నానా పాట్లు పడుతున్నారు. దెబ్బతిన్న ఇళ్లను శుభ్రం చేయడానికి వరద బాధితులు ప్రయత్నిస్తున్నారు.

Eris variant of Covid : మళ్లీ ఎరిస్ కొవిడ్ వేరియంట్ వ్యాప్తి…ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వాతావరణ సంఘటనలు, సుదీర్ఘమైన వేడి తరంగాల కారణంగా మిలియన్ల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వాతావరణ మార్పుల వల్ల వరదలు తీవ్రతరం అవుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్పారు.