Eris variant of Covid : మళ్లీ ఎరిస్ కొవిడ్ వేరియంట్ వ్యాప్తి…ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మళ్లీ ఎరిస్ కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్‌లో ఎరిస్ వేరియంట్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతోంది. యూఎస్‌తోపాటు చైనా, దక్షిణ కొరియా, జపాన్, కెనడా దేశాల్లో ఎరిస్ కొవిడ్ వేరియంట్ ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది....

Eris variant of Covid : మళ్లీ ఎరిస్ కొవిడ్ వేరియంట్ వ్యాప్తి…ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన

Eris variant of Covid

Eris variant of Covid strain : ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో మళ్లీ ఎరిస్ కొవిడ్ వేరియంట్ ప్రబలుతోంది. యునైటెడ్ స్టేట్స్‌లో ఎరిస్ వేరియంట్ అత్యంత ప్రబలంగా వ్యాప్తి చెందుతోంది. యూఎస్‌తోపాటు చైనా, దక్షిణ కొరియా, జపాన్, కెనడా దేశాల్లో ఎరిస్ కొవిడ్ వేరియంట్ ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా ప్రకటించింది. (WHO declares Eris variant) ఒమైక్రాన్ సంతతికి చెందిన ఎరిస్ వేరియంట్ వల్ల ఎదురయ్యే ప్రమాదం గురించి మరింత అధ్యయనం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది.

Hawaii wildfire : హవాయి ద్వీపంలో కార్చిచ్చు…53 కు పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి భవనాలు దగ్ధం

కొవిడ్ -19 (COVID-19) ప్రపంచవ్యాప్తంగా 6.9 మిలియన్లకు పైగా ప్రజలను చంపింది.ఈ వైరస్ ఉద్భవించినప్పటి నుంచి 768 మిలియన్లకు పైగా కేసులు వెలుగుచూశాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొవిడ్ ను 2020 మార్చి నెలలో మహమ్మారిగా ప్రకటించింది. ఈ సంవత్సరం మేలో కొవిడ్-19 కోసం ప్రపంచ అత్యవసర స్థితిని ముగించింది. చాలా దేశాలు కొవిడ్ డేటాను తమకు నివేదించడం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ చెప్పారు.

Prime Minister Narendra Modi : మణిపుర్‌పై మోదీకి అమెరికా గాయని మేరి మిల్‌బెన్ మద్ధతు

ఎరిస్ వేరియంట్ వైరస్‌కు (Eris variant of Covid strain) సంబంధించి 11శాతం మంది మాత్రమే ఆసుపత్రిలో చేరినట్లు ఘెబ్రేయేసస్ చెప్పారు. యునైటెడ్ స్టేట్స్, చైనాలో వ్యాపిస్తున్నఎరిస్ కరోనావైరస్ జాతిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ బుధవారం వర్గీకరించింది. అయితే ఇది ఇతర రకాల వేరియంట్ల కంటే ప్రజారోగ్యానికి ముప్పుగా అనిపించడం లేదని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. ఎరిస్ వైరస్ ఓమైక్రాన్ వేరియంట్‌ల కంటే తీవ్రంగా లేదని ప్రపంచ ఆరోగ్యసంస్థ టెక్నికల్ లీడ్ మరియా వాన్ కెర్‌ఖోవ్ చెప్పారు.