knife attack in tokyo : సంతోషంగా ఉండే ఆడవాళ్లంటే కసి..వాళ్లని చంపాలనే టోక్యో రైలులో కత్తితో దాడి
సంతోషంగా కనిపించే ఆడవాళ్లంటే అతనికి ఇష్టముండదట..సంతోషంగా కనిపించే ఆడవాళ్లను చూస్తే కసితో రగిలిపోతాడట..అందుకే జపాన్ రాజధాని నగరం టోక్యోలో రైలులో ప్రయాణించే కొంతమంది మహిళలు సదరగా ఏదో చెప్పుకుంటుండటం చూసి వారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడో యువకుడు.

Knife Attacker On Tokyo Train
Knife Attacker On Tokyo Train : సంతోషంగా కనిపించే ఆడవాళ్లంటే అతనికి ఇష్టముండదట..సంతోషంగా కనిపించే ఆడవాళ్లను చూస్తే కసితో రగిలిపోతాడట..అందుకే రైలులో ప్రయాణించే కొంతమంది మహిళలు సదరగా ఏదో చెప్పుకుంటుండటం చూసి వారిపై కత్తితో దాడికి పాల్పడ్డాడో యువకుడు. జపాన్ రాజధాని నగరం టోక్యోలో ఈ దారుణ ఘటన జరిగింది. టోక్యో ప్యాసింజర్ రైలులో ఒక యువకుడు సడెన్ గా కత్తితో మహిళలపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఒక యువతి తీవ్రంగా గాయపడగా..మరో పదిమందికి స్వల్పగాయాలయ్యాయి.
శుక్రవారం (ఆగస్టు 6,2021) రాత్రి ప్రధాన స్టేడియానికి సుమారు 15 కిలోమీటర్లు దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ‘సంతోషంగా కనిపించే మహిళలను హత్య చేయాలనే ప్లాన్ తో ఈ దాడి చేశాను’ అని సదరు నిందితుడు చెబుతుంటే విన్న పోలీసులు షాక్ అయ్యారు. సదరు నిందుతుడు చెప్పిన ఈ కారణం తీవ్ర కలకలం రేపింది. జపాన్ పశ్చిమ ప్రాంతంలో ఓడక్యు లైన్‌లో ‘యుసుకే సుశిమా‘ అనే 36 ఏళ్ల వ్యక్తి సడన్‌గా మహిళలపై కత్తితో దాడికి తెగబడ్డాడు. ఈ ఘటనలో యూనివర్సిటీ విద్యార్థిని తీవ్రంగా గాయ పడగా ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
రైలులో ఓ వ్యక్తి దాడికి పాల్పడిన విషయంపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. రైలును సమీపంలోని స్టేషన్‌లో రైలు నిలిపివేసిన అధికారులు తీవ్రంగా గాయపడిన యువతి సహా తొమ్మిది మందిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. దాడి చేసిన వ్యక్తిని యూసుకే సుషిమాగా గుర్తించారు.
అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారింగా షాకింగ్ విషయాల్లో వెల్లడించారు.‘ సంతోషంగా కనిపించే మహిళలను చంపాలని తాను ఆరు సంవత్సరాల క్రితం నిర్ణయించుకున్నానని చెప్పటంతో పోలీసులు కూడా షాక్అయ్యారు. హ్యాపీగా ఉన్న ఆడవాళ్లను చూస్తే..నేను కసితో రగిలిపోతానని అటువంటివారిని చంపేయాలని అనిపిస్తుందని అందుకే రైలులో నవ్వు మాట్లాడుకునేవారిని చూసి కోపం వచ్చిందని వాళ్లను చంపాలని కత్తితో దాడి చేశానని తెలిపాడు. సంతోషంగా ఉండే ఏ ఆడవాళ్లైనా సరే నాకు నచ్చదు.వారిని చంపేయాలని అనుకుంటానని తెలిపాడు.
కాగా నిందితుడి దగ్గర కత్తి,కత్తెర, వంట నూనెతో పాటు ఓ లైటర్ కూడా ఉండటంతో పోలీసులు ఖంగుతిన్నారు. ఇవన్నీ నీదగ్గర ఎందుకున్నాయని అడుగగా అంతకంటే షాకింగ్ విషయాలు చెప్పాడు సుషిమా. రైల్లో నిప్పు పెట్టాలని ప్లాన్ తో అవన్నీ వెంట తెచ్చుకున్నానని చెప్పాడు.దీంతో పోలీసులు అవన్నీ స్వాధీనం చేసుకున్నారు. కాగా కత్తితో దాడి చేసిన వెంటనే అతడిని పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది. లేకుంటే పెను ప్రమాదమే సంభవించేందని పోలీసులు భావిస్తున్నారు.