ప్రపంచంలో అత్యంత భారీ ‘స్నో ఫెస్టివల్’

  • Published By: veegamteam ,Published On : December 30, 2019 / 06:45 AM IST
ప్రపంచంలో అత్యంత భారీ ‘స్నో ఫెస్టివల్’

Updated On : December 30, 2019 / 6:45 AM IST

శీతాకాలం..చలికాలం. వణికించేస్తోంది. నీరుసైతం గడ్డ కట్టిపోయే చలి. ఈ చల్లని చలికాలంలో  అత్యంత భారీ స్థాయిలో ‘స్నో ఫెస్టివల్’ ప్రారంభంకానుంది. చైనాలోని హెలొంగ్యాంగ్ ప్రాంతంలోని హార్బిన్ పట్టణంలో జరిగే ఈ స్నో ఫెస్టివల్ కు ప్రజలు అంతకంటే భారీగా క్యూ కడుతుంటారు.  36 వ హార్బిన్ ఇంటర్నేషనల్ ఐస్ అండ్ స్నో ఫెస్టివల్  “ఐస్ స్నో ఇంటిగ్రేషన్, హ్యాపీ టు గో టుగెదర్”పేరుతో జనవరి 5న ప్రారంభం కానుంది. 

ఇది ప్రపంచంలో అత్యంత భారీ స్థాయిలో జరిగే స్నో ఫెస్టివల్‌గా పేరు తెచ్చుకుంది. నీరు గడ్డకట్టిన నదులలో నుంచి ఐస్ తీసుకువచ్చి ఎన్నో రకాల ఆకృతులను రూపొందిస్తారు. అలా తయారుచేసిన ఆకృతులను ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శిస్తారు. ఈ స్నో ఫెస్టివల్ లో మైనస్ 17 డిగ్రీల సెల్సియస్‌కు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదుగా ఉంటాయి. 

ప్రతీ సంవత్సరం ఈ ఫెస్టివల్‌ను సందర్శించేందుకు పర్యాటకుల పెరుగుతున్నారు. పలు దేశాల నుంచి ఈ స్నో ఫెస్టివల్ కు చూడటానికి పర్యాటకులు తరలివస్తుంటారు. చక్కగా ఎంజాయ్ చేస్తారు. 1980లో తొలిసారిగా చైనా ఈ ఫెస్టివల్‌ను ప్రారంభించగా..2018లో ఈ ఫెస్టివల్ చూడటానికి రెండు కోట్ల మంది ఇక్కడకు వచ్చారు. 28.7 బిలియన్ యువాన్ (4 4.4 బిలియన్) ఆదాయాన్ని వచ్చింది. ఈ పండుగలో ప్రపంచంలోనే అతిపెద్ద మంచు శిల్పాలు కొలుదీరాయి. వీక్షకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. 

అంటే  ఈ స్నో ఫెస్టివల్ కు ఎంత పేరుందో ఊహించుకోవచ్చు. 80 హెక్టార్ల విస్త్రీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ స్నో ఫెస్టివల్ నెల రోజుల పాటు కొనసాగుతుంది. సన్ ఐలాండ్ నగరం నుండి సాంఘువా నదికి ఎదురుగా ఉన్న ఒక వినోద ప్రదేశంగా పేరొందింది. ఈ మంచు ప్రపంచంలో కొలువుదీరిన శిల్పాలను చూస్తే ఎంత చూసినా తనివి తీరదు. చూపు మరల్చుకోనివ్వవు. మరి ఈ స్నో ఫెస్టివల్ చూడాలంటే చైనా వెళ్లాల్సిందే.