Amazon : అమెజాన్‌లో ఐదేళ్ల చిన్నారి రూ. లక్షలు విలువైన బొమ్మలు ఆర్డర్ .. తల్లి షాక్..!

అమ్మ ఫోన్ పట్టుకున్న ఓ ఐదేళ్ల చిన్నారి అమెజాన్ లో లక్షల రూపాల విలువ చేసే బొమ్మలు ఆర్డర్ చేసింది. సుమారు రూ.2.47లక్షలు విలువ చేసే బొమ్మల్ని ఆర్డర్ చేయటం చూసిన తల్లి షాక్ అయ్యింది.

Amazon : అమెజాన్‌లో ఐదేళ్ల చిన్నారి రూ. లక్షలు విలువైన బొమ్మలు ఆర్డర్ .. తల్లి షాక్..!

Amazon Online Shopping

Updated On : April 5, 2023 / 8:05 PM IST

Amazon : అమ్మ ఫోన్ పట్టుకున్న ఓ ఐదేళ్ల చిన్నారి ఆన్ లైన్ షాపింగ్ దిగ్గజం అమెజాన్ లో లక్షల రూపాల విలువ చేసే బొమ్మలు ఆర్డర్ చేసింది. సుమారు రూ.2.47లక్షలు విలువ చేసే బొమ్మల్ని ఆర్డర్ చేసింది. 10 మోటార్‌సైకిళ్ల బొమ్మలు, ఒక జీప్ బొమ్మ, 10 జతల ఉమెన్స్ కౌగర్ల్ బూట్లు ఆర్డ్ చేసింది.

మసాచుసెట్స్ కు చెందిన జెస్సికా నూన్స్ అనే మహిళ తన ఐదేళ్ల కూతురు కలిసి కారులో వెళుతున్నారు. కారులో కుదురుగా కూర్చోని ఆ ఐదేళ్ల పిల్ల నానా హంగామా చేస్తోంది.అల్లరల్లరి చేసిపారేస్తోంది. పిల్ల అల్లరికి డ్రైవింగ్ పై కాన్ సన్ ట్రేషన్ చేయలేకి గడుగ్గాయిని బుద్ధిగా కూ కూర్చోపెట్టటానికి తన ఫోన్ ఇచ్చింది. ఫోన్ చేతిలో ఉంటే పెద్దవాళ్లే ఊరికే ఉండరు..ఇక చిన్న పిల్లలు ఊరికే ఉంటారా ఏంటీ?…ఏవోవో ఓపెన్ చేస్తారు. అలా ఆ చిన్నారి అమెజాన్‌ యాప్ ఓపెన్ చేసింది. ఇష్టమొచ్చినట్లు నొక్కిపారేసింది. అలా ఆ పాపకు బొమ్మలు, 10 జతల కౌగర్ల్ బూట్లను ఆర్డర్ చేసిపారేసింది. మొత్తం 3,000 డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ.2.46 లక్షలు..

ఆ తరువాత కొంతసేపటికి జెస్పికా తన ఫోన్ తీసుకుంది. ఇంకేముంది భారీ ఆర్డర్లు జరిగినట్లు గుర్తించి షాక్ అయ్యింది. ఇది తన కూతురు చేసిన పనేనని అర్థమైంది. కానీ ఏం చేస్తుంది పాపం? ఇక చేసేదేముంది? కూతరు చేసిన బొమ్మలు, జీప్ ఆర్డర్లు కలిపి 3,180 డాలర్లు అయ్యిందని కానీ ఆన్‌లైన్ షాపింగ్ చేయడం తన కుమార్తెకు తెలియదని తెలిసీ తెలియక ఇంత ఖరీదైన ఆర్డర్ చేసిందని చెప్పుకొచ్చారామె.కానీ ఈ ఆర్డర్ల గురించి వెంటనే తెలుసుకోవటంతో కొన్ని మాత్రం క్యాన్సిల్ చేశానని తెలిపారు. కానీ మిగిలిన ఐదు మోటార్‌సైకిళ్లు, రెండు సీట్ల పిల్లల జీప్‌ డెలివరీ వచ్చేయటంతో వేరే దారిలేక వాటిని తీసుకున్నారామె. ఇంత పని చేసినా జెస్సికా తన కూతురిని మాత్రం ఆమె ఏమీ అనలేదు. కనీసం కోప్పడలేదు. తల్లి కదా..ముద్దుగా విసుక్కుంది ముద్దుల కూతుర్ని..నువ్వు అల్లరి చేయకుండా ఉంటే నీకు ఇంకా ఎక్కువ బొమ్మలు కొనిస్తాను సరేనా?అంటూ మందలించింది.