పెరులో భూప్రకంపనలు: వణికిపోయిన జనం

దక్షిణ అమెరికా వాయువ్య నగరమైన పెరులో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6 గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని వారంతా రోడ్లపైకి పరుగులు తీశారు.

  • Published By: sreehari ,Published On : January 19, 2019 / 06:23 AM IST
పెరులో భూప్రకంపనలు: వణికిపోయిన జనం

దక్షిణ అమెరికా వాయువ్య నగరమైన పెరులో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6 గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని వారంతా రోడ్లపైకి పరుగులు తీశారు.

లిమా: దక్షిణ అమెరికా వాయువ్య నగరమైన పెరులో భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.6 గా నమోదైంది. ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లలోని వారంతా రోడ్లపైకి పరుగులు తీశారు. స్థానిక కాలమానం ప్రకారం ఉత్తర బరంకాకు 169 కిలోమీటర్ల దూరంలో 99 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించినట్టు యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్ జీఎస్) వెల్లడించింది. ఎలాంటి సునామి హెచ్చరికలు జారీ కాలేదు.

అలాగే భూకంపం కారణంగా ఆస్తినష్టం, ప్రాణనష్టం వాటిల్లనట్టు ఇప్పటివరకూ ఎలాంటి నివేదిక రాలేదు. పసిఫిక్ సముద్ర తీర ప్రాంతానికి సమీపాన ఉన్న పెరు నగరంలో తరచూ అగ్నిపర్వతాలు పేలడం, భూకంపాలు సంభవిస్తుంటాయి. గత ఏడాది జనవరి 14న భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.1 గా నమోదైంది. భూకంపం ధాటికి ఇద్దరు మృతిచెందగా, 120 మందికి పైగా ప్రజలు గాయపడ్డారు. వందలాది భవనాలు నేలమట్టమయ్యాయి. వేలాది మంది నిరాశ్రయిలయ్యారు.