శ్రీలంక భీతావహం : ఆరుగురు భారతీయుల మృతి

శ్రీలంకలో జరిగిన బాంబు పేలుళ్లలో మృతుల సంఖ్య క్షణక్షణానికి పెరుగుతోంది. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం ఉదయానికి మృతుల సంఖ్య 290 మందికి చేరింది. గాయపడిన 500 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మృతి చెందిన వారిలో 35 మంది విదేశీయులున్నారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం సాయంత్రం లక్ష్మీ, నారాయణ చంద్రశేఖర్, రమేష్, రెజీనాలు మృతి చెందినట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో ఇద్దరు భారతీయులు మృతి చెందారు. మృతి చెందిన వారు హనుమంతరాయప్ప, ఎం. రంగప్పలుగా గుర్తించారు. ఇప్పటి వరకు 5 గురు భారతీయులు మృతి చెందినట్లు శ్రీలంకలోని హై కమిషన్ ఆఫ్ ఇండియా స్పష్టం చేసింది.
Also Read : శ్రీలంక బాంబు పేలుళ్లు : హైదరాబాద్ లో అలర్ట్ : HMWSSB
ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఈస్టర్ పండుగ సందర్భంగా ఉగ్రవాదులు బాంబులు, ఆత్మాహుతి దాడులతో చెలరేగిపోయారు. చర్చీలు, హోటళ్లను టార్గెట్ చేసి దాడులకు దిగారు. మొత్తం 8 చోట్ల పేలుళ్లు జరిపారు. ఏప్రిల్ 22వ తేదీ సోమవారం మరో బాంబును అక్కడి బాంబు స్వ్కాడ్ గుర్తించి నిర్వీర్యం చేసింది. శ్రీలంకలో నెలకొన్న పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్..శ్రీలంకలో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఉగ్రదాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి.
* ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం బాంబులు పేలాయి.
* 6 గంటల వ్యవధిలో మొత్తం 8 బాంబులు పేలాయి.
* బట్టికలోవా, కోచికడే, సెయింట్ సెబాస్టియన్, చర్చిలు, సినామోన్ గ్రాండ్, షాంగ్రిల్లా, కింగ్స్ బరీ హోటల్స్‌లో పేలుళ్లు జరిగాయి.
* 2 చోట్ల ఆత్మాహుతి దాడులు జరిగాయి.
* షాంగ్రిలా హోటల్‌లోని కాఫిటేరియా, కారిడర్ దగ్గర ఇద్దరు తమను తాము పేల్చుకున్నారు.
* సూసైడ్ బాంబర్లు.. ఇస్లామిక్ తీవ్రవాదులుగా అంచనాకు వచ్చారు.
* 9వ బాంబును అక్కడి బాంబు స్వ్కాడ్ నిర్వీర్యం చేశారు.
Also Read : తగ్గని ఇంటర్ మంటలు : అన్నింట్లో 80.. లెక్కల్లో మాత్రమే 5 మార్కులు