6ఏళ్ల చిన్నారికి సంకెళ్లు వేసి అరెస్ట్ చేసిన పోలీసులు..ఎందుకంటే

ఆరేళ్ల చిన్నారిని పోలీసులు అరెస్ట్ చేసి సంకెళ్లతో బంధించి..వ్యాన్ ఎక్కించి తీసుకెళ్లారు. దాంతో చిన్నారి ప్లీజ్..నన్ను వదిలిపెట్టండి అంటూ పోలీసులు ఏడుస్తూ వేడుకున్నా ఆ పోలీసులకు కనికరం కలగలేదు. ఉగ్రవాదుల్ని..కరడుకట్టిన నేరస్థుల్ని తీసుకెళ్లినట్లుగా ఆరేళ్ల బాలికను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ వ్యాన్ ఎక్కించి తీసుకెళ్ళిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలోని ఓర్లాండోలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. ఫ్లోరిడాలోని ఓర్లాండో పట్టణానికి చెందిన ఆరేళ్ల బాలిక.. స్థానికంగా ఉన్న ఓ స్కూల్లో చదువుకుంటోంది. స్కూల్లో ఆ చిన్నారి బాగా అల్లరి చేసేంది. తోటి పిల్లల్ని ఏడిపించేంది. వారితో గొడవలు పెట్టుకునేది.తిట్టేది, కొట్టేది, గిచ్చేది. చాలా దూకుడుగా ప్రవర్తించేది. స్కూల్ టీచర్లతో కూడా చాలా దురుసుగా ప్రవర్తించేంది. స్కూల్ సెక్యురిటీతో కూడా చాలా దురుసుగా వ్యవహరించేది. దీంతో స్కూల్ యాజమాన్యం ఆ ఆరేళ్ల బాలికపై పోలీసులకు కంప్లైంట్ చేసింది.
ఈ పిల్ల చేష్టలు భరించలేకపోతున్నాం దయచేసి మీరే ఏదైనా చేయండి అంటూ కంప్లైంట్ ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఆరేళ్ల చిన్నారికి ఏఖంగా సంకెళ్లు వేసి, పోలీసు వాహనం ఎక్కించి..తీసుకెళ్లిపోయారు.చేతికి సంకెళ్లువేసి పోలీసులు అరెస్టు చేస్తుంటే ఆ చిన్నారి ఏడుస్తూ.. ప్లీజ్..నన్ను అరెస్టు చేయొద్దంటూ పోలీసులను ప్రాధేయపడింది. వేడుకుంది. బతిమాలింది.
ఇంకెప్పుడూ ఇలా చేయనని టీచర్స్ విషయంలో చాలా బుద్ధిగా ఉంటానని వేడుకుంది. అయినా.. ఆ ఆరేళ్ల చిన్నారిపై పోలీసులు కనికరించలేదు. అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. కాగా.. పోలీసులు ఆ చిన్నారిని అరెస్టు చేస్తున్నప్పటి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసుల చర్యను నెటిజన్లు తీవ్రంగా ఖండించారు. ఆ ఆరేళ్ల చిన్నారి ఓ నల్లజాతీయురాలు కాబట్టే.. పోలీసులు ఆ విధంగా ప్రవర్తించారంటూ కామెంట్ చేస్తున్నారు. దీంతో స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు.. ఆరేళ్ల చిన్నారిని అరెస్టు చేసిన వారిని సస్పెండ్ చేశారు.
Read More | APలో ACB ఫీవర్ : అవినీతిపరుల పేర్లను చెప్పాలి – ACB DG లేఖ