దేవుడిచ్చాడు : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 67 ఏళ్ల బామ్మ

  • Published By: veegamteam ,Published On : October 29, 2019 / 01:47 AM IST
దేవుడిచ్చాడు : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 67 ఏళ్ల బామ్మ

Updated On : October 29, 2019 / 1:47 AM IST

35 సంవత్సరాలు దాటాయంటేనే నేటి తరంవారికి  బిడ్డలు పుట్టటం కష్టమైపోతోంది. కానీ ఓ బామ్మ మాత్రం 67 ఏళ్ల వయస్సులో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అదికూడా సహజసిద్ధంగా. ఈ అద్భుతమైన..అరుదైన ఘటన అక్టోబర్ 27న చైనాలో జరిగింది. 

వివరాల్లోకి వెళితే..అది తూర్పు చైనాలో హువాంగ్ అనే (68) టియాన్ (67) భార్యాభర్తలు. వారికి ఇద్దరు పిల్లలున్నారు. ముచ్చటైన కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో వారికి టియాన్ గర్భవతి అనే అరుదైన వార్త విన్నారు. అది విన్న ఆ భార్యాభర్తలు ఇదేంటి ఈ వయస్సులో ఇలా..అంటూ ఆందోళన పడలేదు. ఎంతో సంతోషించారు. 

టియాన్ కు నెలలు నిండాయి.  జావోవాంగ్ నగరంలోని ఓ ఆస్పత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.  టియాన్‌,  హువాంగ్‌ దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ‘ఈ చిట్టి పాపను దేవుడు ఈ వయస్సులో మనకు వరంగా ఇచ్చాడు. మనకోసమే స్వర్గలోకం నుంచి వచ్చింది’ అంటూ మురిసిపోయారు. ఈ వయస్సులో తనను తండ్రిని చేసిన భార్యను మురిపెంగా ముద్దు పెట్టుకున్నాడు హువాంగ్. 

టియాన్ గర్భం దాల్చిందని తెలిసిననాటి నుంచి హువాంగ్ ఎంతో అపురూపంగా చూసుకున్నాడు. చక్కటి ఆహారం అందేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. సాధారణంగా లేటు వయస్సులో గర్భం దాల్చితే మహిళలు ఆందోళన పడతారు. కొంతమంది సిగ్గుపడతారు. పురుషులు కూడా ఈ వయస్సులో తండ్రి అయితే సమాజం ఏమనుకుంటుందోనని అనుకుంటారు. కానీ 68,67 ఏళ్ల వయస్సులో తమకు పుట్టిన బిడ్డను తమకు దేవుడు ఇచ్చిన బిడ్డ అని మురిసిపోతున్నారు ఈ చైనా దంపతులు. ఆ బిడ్డకు టియాన్సీ – మాండరిన్ అని పేరు పెట్టాలని  నిర్ణయించుకున్నారు.

హువాంగ్‌ న్యాయవాదిగా పని చేస్తున్నారు. టియాన్‌ పీడియాట్రిక్స్ నర్సుగా పనిచేసి రిటైర్‌ అయ్యారు. వయస్సుతో వచ్చిన చిన్నపాటి సమస్యలతో తొమ్మిది నెలల క్రితం ఆస్పత్రికి వెళ్లగా టియాన్ గర్భం ధరించినట్లుగా డాక్టర్లు చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న టియాన్ దంపతులు మొదట నమ్మలేకపోయారు. తరువాత సంతోష పడ్డారు. 

టియాన్ కు సర్జరీ చేసి  ప్రసవం చేసిన డాక్టర్లు మాట్లాడుతూ..టియాన్ ప్రసవ సమయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నామన్నారు.. 2,506 గ్రాముల (5.52 పౌండ్లు)  బిడ్డకు జన్మనిచ్చిందన్నారు. సాధారణంగా 60 ఏళ్లు వచ్చేసరికి మహిళలకు అండాశయాలు గర్భం ధరించేందుకు సహకరించవు. కానీ టియాన్ విషయంలో మాత్రం ఇతర మహిళ మాదిరిగా కాకుండా 40 ఏళ్ల మహిళల మాదిరిగానే అండాశయాలు చక్కగా పనిచేశాయనీ..దీంతో బిడ్డ ఆరోగ్యంగా పెరగటమే కాక..ప్రసవ సమయంలో పెద్దగా ఇబ్బందులు రాలేదని  సీనియర్ డాక్టర్ లియు చెంగ్వెన్ తెలిపియారు. ఈ వయస్సులో సహజ సిద్ధంగా గర్భం దాల్చటం అరుదుగా జరుగుతుందని అన్నారు. 

తమ అంచనా ప్రకారం..చైనాలో సహజంగా గర్భం ధరించిన మహిళగా Ms టియాన్ చరిత్ర సృష్టించారనీ అన్నారు. గతంతో ఈశాన్య జిలిన్ ప్రావిన్స్ రాజధాని చాంగ్‌చున్‌లో 2016 లో పండంటి అబ్బాయికి జన్మనిచ్చిన 64 ఏళ్ల మహిళను అధిగమించి ఆమె ఇప్పటికే చైనాకు పెద్ద తల్లి అయ్యారని అన్నారు.