Beer తాగిన వృద్ధుడికి రూ. 4.74 లక్షల జరిమానా

Beer : పబ్ కు వెళ్లి మెల్లి మెల్లిగా కూల్ బీర్ (Cool Beer) తాగుతున్న ఓ వృద్ధుడికి పోలీసులు భారీ జరిమాన విధించారు. రూ. 4.74 లక్షల ఫైన్ కట్టు..అంటూ చలాన్ విధించారు. ఒక్క బీర్ కోసం వెళితే..అంత ఫైన్ వేస్తారా ? అని మీరు ఆశ్చర్యపోతున్నారు కదూ. అతను హోం క్వారంటైన్ లో ఉండాల్సిన వ్యక్తి. కానీ..నిబంధనలు ఉల్లంఘించి పబ్ లో బీరు తాగుతున్నందుకు అంత పెద్ద మొత్తంలో ఫైన్ వేశారు. ఈ ఘటన బ్రిటన్ లో చోటు చేసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా కరోనా (Corona) వైరస్ ఉగ్రరూపం దాలుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో..బ్రిటన్ లో కఠిన నిబంధనలు అమలు జరుపుతున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఫైన్ లు వేస్తున్నారు. 79 ఏళ్ల హెన్రీ మెక్‌కార్తీ (Henry McCarthy), గ్వెర్న్సీ నుంచి యూకేకు వచ్చాడు. దీంతో పోలీసులు అతడిని 14 రోజులు ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు.
తనిఖీల్లో భాగంగా..అతను ఇచ్చిన అడ్రస్ కు వెళ్లి చూశారు. అక్కడ అతను కనిపించలేదు. ఎక్కడకు వెళ్లాడబ్బా ? అంటూ ఆరా తీశారు. క్రాబీ జాక్ (Crabby Jack) అనే పబ్ ఎదుట ఓ కారు నిలిపి ఉంచి ఉంది. పబ్ లోకి వెళ్లి చూడగా..మెక్ కార్తీ..బీర్ తాగుతూ కనిపించాడు. అతడిని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరిచారు.
జడ్జీ రూ. 4.74 లక్షల జరిమాన విధించారు. అయితే..తన క్లయింట్ (మెక్ కార్తీ) సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ..బీరు తాగాడని అడ్వకేట్ వాదించారు. బయటకు వెళ్లాడంటేనే..నిబంధనలు ఉల్లంఘించినట్లు అవుతుందని జడ్జీ వెల్లడించారు. మొత్తానికి ఒక బీర్ తాగడానికి వెళ్లి..అంత ఫైన్ కట్టాల్సి వచ్చింది.