South Africa: బర్త్‌డే పార్టీలో కాల్పులు.. 8 మంది మృతి.. ముగ్గురికి గాయాలు

ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. జెబెర్హా పట్టణం, క్వజాకెలే ప్రాంతంలోని ఒక ఇంట్లో ఆదివారం బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీ జరుగుతుండగా ఆయుధాలు ధరించిన ఇద్దరు చొరబడ్డారు. పార్టీలో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.

South Africa: బర్త్‌డే పార్టీలో కాల్పులు.. 8 మంది మృతి.. ముగ్గురికి గాయాలు

Updated On : January 30, 2023 / 1:51 PM IST

South Africa: అమెరికా కాల్పుల ఘటనలు మరువక ముందే దక్షిణాఫ్రికాలో కాల్పుల ఘటన సంచలనం సృష్టిస్తోంది. అక్కడి తూర్పు కేప్ ప్రావిన్స్‌లో ఒక బర్త్ డే పార్టీలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

Hockey World Cup 2023: పురుషుల హాకీ ప్రపంచ కప్ విజేత జర్మనీ.. ఫైనల్‌లో బెల్జియంపై గెలుపు

ఈ ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. జెబెర్హా పట్టణం, క్వజాకెలే ప్రాంతంలోని ఒక ఇంట్లో ఆదివారం బర్త్ డే పార్టీ జరిగింది. ఈ పార్టీ జరుగుతుండగా ఆయుధాలు ధరించిన ఇద్దరు చొరబడ్డారు. పార్టీలో పాల్గొన్న వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల తర్వాత నిందితులు ఇద్దరూ అక్కడ్నుంచి పారిపోయారు. ఘటన సమాచారం అందుకున్న భద్రతా దళాలు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాల్ని స్వాధీనం చేసుకున్నారు.

Elon Musk: నిద్రలేని రాత్రులు గడుపుతున్న ఎలన్ మస్క్.. ఐదు కంపెనీల బాధ్యతలతో సతమతం

పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పటివరకు నిందితుల్లో ఒక్కరిని కూడా పోలీసులు అరెస్టు చేయలేదు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నారు. మరోవైపు ఈ కాల్పుల ఘటనకు కారణాలు కూడా తెలియరాలేదు. నిందితుల్ని త్వరలోనే పట్టుకుంటామని అధికారులు చెప్పారు. గతేడాది జూలైలో కూడా దక్షిణాఫ్రికాలో కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఆయుధాలు ధరించిన కొందరు ఒకరిపై ఒకరు జరుపుకొన్న కాల్పుల్లో 19 మంది మరణించారు. ఆ తర్వాత మళ్లీ ఈ స్థాయిలో కాల్పులు జరగడం ఇదే మొదటిసారి.