Brazil Building Collapse : క్షణాల్లో కుప్పకూలిన అపార్ట్‌మెంట్ భవనం.. ఎనిమిది మంది మృతి .. వణికించిన సీసీ కెమెరా విజువల్స్

వర్షాకాలం మొదలైతే పురాతన భవనాల విషయంలో కాస్త జాగ్రత్త వహించాల్సిందే. బ్రెజిల్‌లో శిథిలావస్థకు చేరిన ఓ అపార్ట్మెంట్ భారీ వర్షాలకు కుప్పకూలింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది.

Brazil Building Collapse : క్షణాల్లో కుప్పకూలిన అపార్ట్‌మెంట్ భవనం.. ఎనిమిది మంది మృతి .. వణికించిన సీసీ కెమెరా విజువల్స్

Brazil Building Collapse

Brazil Building Collapse : ఉదయం 6:35 ని.లు.. ఇంకా చాలామంది నిద్రలో ఉన్నారు. నాలుగు అంతస్థుల అపార్ట్మెంట్ భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈశాన్య బ్రెజిల్‌లో ఓ అపార్ట్ మెంట్ కుప్పకూలిన ఘటనలో 8 మంది మరణించారు. రెస్క్యూ సిబ్బంది శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.

Cyclone Hits Brazil: బ్రెజిల్‌ను తాకిన తుపాన్..11మంది మృతి, 20 మంది అదృశ్యం

బ్రెజిల్ ఈశాన్య పెర్నాంబుకో రాష్ట్రంలోని రెసిఫే శివారు జంగాలో అకస్మాత్తుగా నాలుగు అంతస్థుల అపార్ట్మెంట్ కుప్పకూలింది. ఉదయం 6.35 ని.ల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో 8 మంది మరణించారని అధికారులు చెబుతున్నారు. రెస్క్యూ టీం సహాయక చర్యల్లో 5 గురు ప్రాణాలతో బయటపడ్డారు. ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 5 గురి జాడ తెలియలేదు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Cocaine In US White House : వైట్‌హౌస్‌లో కొకైన్ కలకలం .. అమెరికా అధ్యక్ష భవనంలోకి ఎలా వచ్చింది..?!

అపార్ట్మెంట్ శిథిలావస్థకు చేరుకోవడంతో పాటు ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా కూడా భవనం కూలి ఉంటుందని చెబుతున్నారు. భారీ వర్ష సూచనలతో పునాతన భవనాల్లో నివాసం ఉన్నవారికి అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.