Earthquake : నేపాల్ లో మళ్లీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 5.3 తీవ్రత నమోదు
ఖాట్మండు సమీపంలో భూమికి 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.

earthquake in Nepal
Earthquake In Nepal : నేపాల్ లో వరుస భూకంపాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. తాజాగా నేపాల్ లో మళ్లీ భూకంపం సంభవించింది. ఆదివారం ఉదయం 7.24 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదు అయింది. నేపాల రాజధాని ఖాట్మండు సమీపంలో భూమికి 10 కిలో మీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ పేర్కొంది.
అయితే ఈ భూకంపం వల్ల ఏమైనా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగిందా లేదా అన్న వివరాలు తెలియాల్సివుంది. కాగా, అక్టోబర్ మొదటి వారంలో కూడా నేపాల్ వరుస భూకంపాలు ప్రజలను వణికిస్తున్నాయి. కేవలం అర్ధగంట వ్యవధిలో ఐదుసార్లు భూమి కంపించడంతో నేపాల్ లో పెను విషాదం నెలకొంది. తీవ్ర భూకంపాల ధాటికి నేపాల్ లో పలు భవనాలు కుప్పకూలాయి.
కూలిన భవన శిథిలాలను తొలగిస్తుంటే కుప్పలుకుప్పులుగా మృతదేహాలు బయటపడ్డాయి. మొత్తం మృతుల సంఖ్య 3,600 దాటింది. వేలాది మందికి గాయాలు అయ్యాయి. ఆ విషాద ఛాయలు వీడకముందే మరోసారి భూకంపం సంభవించడంతో నేపాలీలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.