Bomb Blast : పాకిస్తాన్ మసీద్ లో బాంబు పేలుడు.. 30 మంది మృతి

మసీదులో జరిగిన ఆత్మహుతి దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. అధికారుల నుంచి పేలుడుకు సంబంధించిన నివేదికను కోరారు.

Bomb Blast : పాకిస్తాన్ మసీద్ లో బాంబు పేలుడు.. 30 మంది మృతి

Bomb Blast

Updated On : March 4, 2022 / 3:49 PM IST

bomb blast in Pakistan : పాకిస్తాన్ పెషావర్ లోని ఓ మసీద్ లో బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందారు. కొచ్చా రిసాల్దార్ లోని మసీద్ లో బాంబు పేలుడు జరిగింది. ఈ ఘటనలో 33 మంది మృతి చెందగా, మరో 50 మందికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పెషావర్ లోని ఓ మసీద్ పై సూసైడ్ అటాక్ జరిగినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

లేడీ రీడింగ్ ఆస్పత్రికి చెందిన అధికారులు మృతదేహాలను గుర్తిస్తున్నారు. పెషావర్ సిటీ పోలీసు అధికారి ఇజాజ్ అషాన్ మాట్లాడుతూ తాజా పేలుడు ఘటనలో ఓ పోలీస్ అధికారి మృతి చెందినట్లు తెలిపారు. 30 మంది మృతదేహాలను ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు లేడీ రీడింగ్ ఆస్పత్రి మేనేజర్ అసిమ్ ఖాన్ వెల్లడించారు.

Afghanistan: పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ బోర్డర్ లో స్కూలు వద్ద పేలిన బాంబు..9మంది చిన్నారుల మృతి!

పెషావర్ లోని కిస్సా ఖవాని బజార్ లో ఉన్న మసీదులోకి ఇద్దరు సాయుధులు చొరబడే ప్రయత్నం చేశారు. అక్కడ భద్రత కల్పిస్తున్న పోలీసులపై మొదటగా కాల్పులు జరిపారు. ఆ ఘటనలో ఓ పోలీసు మృతి చెందగా, మరో పోలీసుకు గాయాలు అయ్యాయి. కిస్సా ఖవాని బజార్ లో చాలా షాపులు ఉంటాయి. శుక్రవారం ప్రార్థనల సమయంలో ఆ ప్రాంతమంతా రద్దీగా ఉంటుంది. లేడీ రీడింగ్ ఆస్పత్రి దగ్గర అలర్ట్ ప్రకటించారు.

మసీదులో జరిగిన ఆత్మహుతి దాడిని పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఖండించారు. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించారు. అధికారుల నుంచి పేలుడుకు సంబంధించిన నివేదికను కోరారు. నిజానికి ఇవాళ రావల్పిండిలో పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం అయింది. ఆ మ్యాచ్ ను వీక్షించేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి రావాల్సివుంది.