Earthquake In America : అమెరికాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.4గా నమోదు

అమెరికాలోని టెక్సాస్ లో భారీ భూకంపం సంభవించింది. టెక్సాస్ లోని మిడ్ లాండ్ లో నిన్న సాయంత్రం 5.35 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైందని యూఎస్ జియోలజకిల్ సర్వే వెల్లడించింది.

Earthquake In America : అమెరికాలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.4గా నమోదు

earthquake in America

Updated On : December 17, 2022 / 9:49 AM IST

Earthquake In America : అమెరికాలోని టెక్సాస్ లో భారీ భూకంపం సంభవించింది. టెక్సాస్ లోని మిడ్ లాండ్ లో నిన్న సాయంత్రం 5.35 గంటలకు భూమి కంపించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.4గా నమోదైందని యూఎస్ జియోలజకిల్ సర్వే వెల్లడించింది.

మిడ్ లాండ్ పట్టణానికి 22 కిలో మీటర్ల దూరంలో భూకంప కేంద్రం కేంద్రీకృతమైందని తెలిపింది. భూమి అంతర్భాగంలో 9 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని పేర్కొంది. అయితే టెక్సాస్ లో వచ్చిన అతి పెద్ద భూకంపాల్లో ఇది నాలుగోదని అధికారులు తెలిపారు.

Indonesia Earthquake : భీకర భూకంపం.. 162మంది దుర్మరణం, కోట్లలో ఆస్తి నష్టం, ఇండోనేషియాలో తీవ్ర విషాదం

నెల రోజుల్లో మిడ్ లాండ్ లో భూకంపం సంభవించడం ఇది రెండోసారి కావడం గమనార్హం. గత నెల 16వ తేదీన కూడా 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది.