Afghanistan : రక్షించండి మహా ప్రభో..బహిరంగ లేఖ రిలీజ్ చేసిన అప్ఘాన్ జర్నలిస్టులు
తాలిబన్ ఆక్రమిత అప్ఘానిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు అప్ఘానిస్తాన్ పౌరులు,నాయకులు తమని కాపాడాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటుండగా..

Afghan (11)
Afghanistan తాలిబన్ ఆక్రమిత అప్ఘానిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు మరింత ఆందోళకరంగా మారుతున్నాయి. ఇప్పటివరకు అప్ఘానిస్తాన్ పౌరులు,నాయకులు తమని కాపాడాలంటూ అంతర్జాతీయ సమాజాన్ని వేడుకుంటుండగా..తాజాగా జర్నలిస్ట్ లు కూడా ఆ జాబితాలో చేరారు. తమను రక్షించండి మహా ప్రభో అంటూ తాజాగా విడుదల చేసిన ఓ బహిరంగ లేఖలో అప్ఘాన్ జర్నలిస్ట్ లు..ఐక్యరాజ్య సమితి,అంతర్జాతీయ సమాజం,మానవహక్కుల సంస్థలు మరియు మీడియాకు మద్దతునిచ్చే సంస్థలని కోరారు. 150మంది రిపోర్టర్లు సంతకం చేసిన ఈ లేఖ శనివారమే విడుదల చేయగా..ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తాలిబన్ ఆక్రమిత అప్ఘానిస్తాన్ లో…మీడియా వర్కర్లు ఎదుర్కొంటున్న భయాలు,సవాళ్లు పెరుగుతున్న విషయాన్ని,అదేవిధంగా వారి కుటుంబాలు మరియు ప్రాపర్టీని పరిగణలోకి తీసుకొని.. తమ జీవితాలను మరియు కుటుంబాలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితిని మరియు దాతృత్వ దేశాలను కోరుతున్నామని ఆ లేఖలో జర్నలిస్టులు పేర్కొన్నారు. ఈ క్లిష్ఠ సమయంలో..ప్రపంచమంతా కళ్లగప్పగించి చూస్తూ ఉండటానికి బదులుగా తమ ప్రాణాలను మరియు తమ కుటుంబాలను కాపాడాలని అప్ఘానిస్తాన్ కి చెందిన రిపోర్టర్ అహ్మద్ నవిద్ కవోష్ తెలిపారు.
ఇక,అప్ఘానిస్తాన్ లోని పలువరు మహిళా రిపోర్టర్లలోని ఒకరైన నజిఫా అహ్మది..తాలిబన్లు కాబూల్ ని తాలిబన్లు తమ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తాను పనిచేసే మీడియా కంపెనీ మూసివేయబడటంతో ఉపాధి కోల్పోయింది. తన కుటుంబానికి తానే దిక్కు అని,తన కుటుంబాన్ని ఎలా పోషించాలో ఇప్పుడు తనకు అర్థం కావట్లేదని అహ్మది చెబుతోంది. ఇక,అనేకమంది తన తోటి రిపోర్టర్ల పరిస్థితి కూడా ఇదేనని తెలిపారు. మహిళా మీడియా సిబ్బంది పనిచేసుకునేందుకు తాలిబన్లు అనుమతించాలని..ఎందుకంటే చాలా మందికి ఉద్యోగం లేకుంటే ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని అన్నారు.
ఇక,అప్ఘాన్ మీడియా వర్కర్లు ఓ సోషల్ మీడియా క్యాంపెయిన్ ని కూడా ప్రారంభించారు. అంతర్జాతీయ సంస్థలు తమ సమస్యలను లేవనెత్తాలని..తమని కాపాడాలని సోషల్ మీడియా క్యాంపెయిన్ ద్వారా అప్ఘాన్ జర్నలిస్టులు కోరుతున్నారు. ఆగస్టు-15న అష్రఫ్ ఘనీ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఇన్ఫర్మేషన్ యాక్సెస్(సమాచారం పొందడం) పూర్తిగా పరిమితం చేయబడిందని పలు మీడియా కంపెనీల అధినేతలు మరియు అధికారులు చెబుతున్నారు.
కాబూల్ న్యూస్ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎహసనుల్లా సహక్ మాట్లాడుతూ..మీడియా పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. మా విజ్ణప్తులను ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. ప్రస్తుత పరిస్థితి..రిపోర్టర్లకు అనేక అవరోధాలు సృష్టించింది.
మరోవైపు,మీడియాకు స్వేచ్చ ఇస్తున్నామని,మీడియా సిబ్బంది స్వేచ్ఛగా తమ పని తాము చేసుకునేందుకు, ఇస్లామిక్ చట్టాన్ని పాటిస్తూ మరియు నిష్పక్షపాతంగా ఉంటూ మీడియా తమ కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని తాలిబన్ ప్రతినిధులు మీడియా సమావేశాల్లో చెబుతూనే..తాము చేయాల్సింది తాము చేసుకుంటూ పోతున్నారు.
కాగా,కాబూల్ ఎయిర్ పోర్ట్ నుంచి తరలింపు ప్రక్రియ ప్రారంభమైన తర్వాత..దేశం వదిలి పారిపోతున్నవారిలో పలువురు అప్ఘాన్ జర్నలిస్టులు కూడా ఉన్న విషయం తెలిసిందే. ఇక,గత గురువారం కాబూల్ లోని హమీద్ కర్జాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో ఐసిస్-కే ఉగ్రసంస్థ జరిపిన జంట ఆత్మహుతి దాడుల్లో ముగ్గురు అప్ఘాన్ జర్నలిస్టులు కూడా ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
READ Afghanistan : అప్ఘానిస్తాన్ లో మీడియా స్వేచ్ఛ..ఆశ్చర్యంగా ఉందన్న టోలో న్యూస్ ఓనర్!
READ Taliban: తాలిబన్ల కొత్త ఫత్వా.. మళ్లీ ఆడవాళ్లే టార్గెట్
READJournalist: తాలిబాన్లను ప్రశ్నించి, అఫ్ఘాన్ నుంచి పారిపోయిన మహిళా జర్నలిస్ట్