Afghanistan: కాబూల్‌ నుంచి బయల్దేరిన C-17 విమానం.. భారత ఎంబసీ మూసివేత!

అఫ్ఘాన్‌లో ఉద్రిక్త పరిస్థితులతో కాబూల్‌లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. అఫ్ఘానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలిస్తోంది.

Afghanistan: కాబూల్‌ నుంచి బయల్దేరిన C-17 విమానం.. భారత ఎంబసీ మూసివేత!

Afghanistan Crisis India Evacuates Embassy Staff

Updated On : August 17, 2021 / 11:27 AM IST

Afghanistan crisis: అప్ఘానిస్తాన్ తాలిబన్ల ఆక్రమణతో అక్కడివారంతా సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. అఫ్ఘాన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా.. కాబూల్‌లో భారత రాయబార కార్యాలయాన్ని మూసివేశారు. ఎంబీసీ కార్యాలయాన్ని మూసివేస్తున్నట్టు ఇప్పటికే భారత్ ప్రకటించింది. అలాగే రాయబార కార్యాలయ సిబ్బందితో పాటు అక్కడి భారత రాయబారిని కూడా స్వదేశానికి కేంద్రం తరలించింది. అలాగే అఫ్ఘానిస్తాన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపును కూడా కేంద్రప్రభుత్వం వేగవంతం చేసింది. భారతీయులను తిరిగి స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్రం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. ఈ ప్రత్యేక ఆపరేషన్ కోసం అనుసరించాల్సినన వ్యూహాన్ని కూడా కేంద్ర రెడీ చేసింది.

ఇప్పటికే భారత వాయుసేనకు చెందిన C-17 విమానం కాబూల్ నుంచి భారత్ బయల్దేరింది. C-17 విమానంలో 120 మంది దౌత్య, భద్రతా సిబ్బంది ఉన్నారు. మరో విమానంలో మరికొంతమంది ని తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ విమానాల్లో దాదాపు 45 మంది భారతీయ అధికారులు, కొన్ని పరికరాలు, నివేదికలు ఉన్నట్టు సమాచారం. భారతీయ పౌరులు, రాయబార కార్యాలయ సిబ్బంది సహా కొంతమంది ఐటీబీపీ సిబ్బంది కూడా అప్ఘాన్ లో చిక్కుకున్నట్టు తెలుస్తోంది. దాదాపు 500 మంది వరకు భారతీయులు అక్కడే ఉండిపోయినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. వీరిందరిని సాధ్యమైనంత తొందరగా స్వదేశానికి తరలించేందుకు కేంద్రం అన్ని ఏర్పాట్లు చేసింది.
Director Sahraa Karimi: మౌనంగా ఉండొద్దు..అఫ్గాన్‌ దుస్థితిపై మహిళా డైరెక్టర్‌ లేఖ

అఫ్ఘాన్‌ గురుద్వారాలో తలదాచుకున్న భారతీయులు :
మరోవైపు.. అఫ్ఘాన్‌ గురుద్వారాలో భారతీయులు తలదాచుకున్నట్టు తెలుస్తోంది. అఫ్ఘాన్‌ తాలిబన్లు ఆక్రమించుకోవడంతో కాబూల్‌లోని 320 మందికి పైగా భారతీయులు అక్కడి కార్టే పర్వాన్‌ గురుద్వారాలో తలదాచుకున్నారు. వారిలో 270 మందికి పైగా సిక్కులు ఉండగా.. 50 మందికి పైగా హిందువులు ఉన్నట్టు సమాచారం. వారిలో ఎవరికి ఎలాంటి హానీ తలపెట్టబోమని తాలిబన్లు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. వారిని క్షేమంగా స్వదేశానికి తిరిగి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని కేంద్ర మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురీ పేర్కొన్నారు.

కాబూల్‌ గురుద్వారాలో 200 మంది సిక్కులు చిక్కుకుపోయినట్టు తెలుస్తోంది. వారిని క్షేమంగా భారత్‌కు తీసుకురావాలని పంజాబ్‌ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. సాయం చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందంటూ విదేశాంగ మంత్రి జైశంకర్‌కు వెల్లడించారు.అఫ్ఘానిస్తాన్‌ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడం భారత్‌కు మంచిది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. అన్ని సరిహద్దు ప్రాంతాల వద్ద మరింత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

Afghan Women: తాలిబాన్ తిరిగొచ్చారనే భయం.. దేశం వదిలి పారిపోతున్న మహిళా లోకం