Pak Afghan Conflict: ఆఫ్గన్ బార్డర్‭లోనే ఆగిపోయిన వందలాది పాకిస్థాన్ ట్రక్కులు.. ఇది మన దేశానికి ఎందుకు గుడ్ న్యూస్?

పాకిస్థాన్ తన దేశం నుంచి అక్కడ నివసిస్తున్న ఆఫ్గన్ శరణార్థులను బలవంతంగా బహిష్కరించడం ప్రారంభించింది. గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు మూడున్నర లక్షల మందికి పైగా పాకిస్థాన్ నుండి ఆఫ్ఘనిస్థాన్‌కు పంపించారు.

Pak Afghan Conflict: ఆఫ్గన్ బార్డర్‭లోనే ఆగిపోయిన వందలాది పాకిస్థాన్ ట్రక్కులు.. ఇది మన దేశానికి ఎందుకు గుడ్ న్యూస్?

పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ మధ్య సంబంధాలు నిరంతరం మరింత చెడు స్థితికి చేరుకుంటున్నాయి. తాజాగా పాకిస్థాన్ నుంచి వస్తున్న వేలాది ట్రక్కులను టోర్కామ్ సరిహద్దు వద్ద ఆఫ్గనిస్థాన్ నిలిపివేసింది. ఆఫ్గన్ పౌరులను పాక్ బహిష్కరించిన తరువాత పాకిస్థాన్ తో ఆఫ్గనిస్థాన్ ఈ కఠినమైన వైఖరిని అవలంబించింది. ఆఫ్గన్ తీసుకున్న ఈ కఠినమైన వైఖరికి పాకిస్థాన్ షాక్ అవ్వడమే కాకుండా, ఈ ప్రక్రియలో ఆ దేశంతో వాణిజ్యాన్ని సైతం నిలిపివేసింది.

అయితే ఈ వివాదంలో ఇండియాకు ఒక గుడ్ న్యూస్ ఉంది. అదేంటంటే.. ఈ బహిరంగ సరిహద్దు గుండానే పాకిస్థాన్ వ్యాపారం చేసేదని, భారత్‌కు పెద్దఎత్తున డ్రగ్స్‌ను రవాణా చేసేదని విదేశీ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు. ఈ క్లోజ్డ్ ట్రేడ్ అగ్రిమెంట్‌తో ఇకపై భారత్‌లో పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్, అక్రమ వ్యాపారం అరికట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇది కూడా చదవండి: 8 మంది మాజీ నావికాదళ సిబ్బందికి మరణశిక్షపై ఊరట.. భారత్ అప్పీల్‌ను అంగీకరించిన ఖతార్ కోర్టు

పాకిస్థాన్, ఆఫ్గనిస్థాన్ మధ్య క్షీణిస్తున్న సంబంధాలు ఇప్పుడు ఇరు దేశాల వాణిజ్యంపై ప్రభావం చూపుతున్నాయి. ఒక రిపోర్ట్ ప్రకారం.. గత కొన్ని రోజుల నుంచి ఆఫ్గనిస్థాన్ నుంచి వచ్చే వారిపై పాకిస్థాన్ కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. చట్టబద్ధమైన వీసా, పాస్‌పోర్ట్ హోల్డర్లు మాత్రమే వచ్చేలా.. మిగతా వారిని ప్రవేశించకుండా నిషేధించడం ప్రారంభించిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై పాకిస్థాన్ తో  ఆఫ్గన్ అభ్యంతరం చేనిసప్పటికీ.. వాణిజ్యాన్ని మూసివేస్తామని పాక్ బెదిరించడం ప్రారంభించింది.

సమాచారం ప్రకారం.. మంగళవారం సాయంత్రం నుంచి వేలాది పాకిస్థానీ ట్రక్కులను దేశంలోకి రాకుండా ఆఫ్గన్ ఆపడమే కాకుండా, పాక్ లో ఉన్న తమ ట్రక్కులన్నింటినీ వెంటనే తిరిగి రావాలని ఆదేశాలు జారీ చేసింది. ఇలా చేయడం ద్వారా ఆఫ్గనిస్థాన్ ఏకకాలంలో పాకిస్తాన్‌పై పలు అంశాలను లక్ష్యంగా చేసుకున్నట్లు విదేశీ వ్యవహారాల నిపుణులు భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: కొవిడ్ తర్వాత చైనా నుంచి మరో మహమ్మారి.. వేగంగా వ్యాపిస్తున్న హెచ్‌9ఎన్2

వాస్తవానికి.. పాకిస్థాన్ తన దేశం నుంచి అక్కడ నివసిస్తున్న ఆఫ్గన్ శరణార్థులను బలవంతంగా బహిష్కరించడం ప్రారంభించింది. గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు మూడున్నర లక్షల మందికి పైగా పాకిస్థాన్ నుండి ఆఫ్ఘనిస్థాన్‌కు పంపించారు. వీరిలో వేలాది మంది ఆఫ్గనిస్థాన్ నుంచి చట్టబద్ధంగా పాకిస్థాన్‌కు వెళ్లడమే కాకుండా శరణార్థి శిబిరాల్లో నివసిస్తున్నారని పాకిస్థాన్‌పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆఫ్గనిస్థాన్ లోపల పరిస్థితిని మరింత దిగజారిన సందర్భంలో పాకిస్థాన్ కుట్రలు ప్రారంభించింది.

దీనిని ఆఫ్గనిస్తాన్ గ్రహించి పాకిస్థాన్‌పై ఆంక్షలు విధించడం ప్రారంభించింది. ఉత్తర టోర్కామ్ సరిహద్దులో వాణిజ్యం ఆగిపోవడం దీనికి అతిపెద్ద ఉదాహరణ అని చెప్పొచ్చు. పాకిస్థాన్ ట్రక్కుల ద్వారా వాణిజ్యాన్ని నిలిపివేయడం ద్వారా ఇరు దేశాల మధ్య వ్యాపార కార్యకలాపాలను నిలిపివేయడమే కాకుండా, పాకిస్థాన్ నుంచి భారతదేశానికి అక్రమంగా రవాణా అవుతున్న అక్రమ మాదకద్రవ్యాల సరుకులను అరికట్టడంలో కూడా పెద్ద అడుగు వేసింది. పాకిస్థాన్ నుంచి ఆఫ్గనిస్థాన్‌కు పంపిన ట్రక్కుల్లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ తిరిగి పాకిస్థాన్‌కు వచ్చేవని విదేశీ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.