Taliban ban foreign currency : అఫ్ఘానిస్థాన్ లో విదేశీ కరెన్సీపై నిషేధం విధించిన తాలిబన్లు
అఫ్ఘానిస్థాన్‌లో విదేశీ కరెన్సీని ఉపయోగించడంపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇకనుంచి ప్రజలు లావాదేవీలకు విదేశీ కరెన్సీని వినియోగించకూడదని ప్రకటించారు.

Taliban Ban Foreign Currency
Taliban ban on use of foreign currency : అఫ్ఘానిస్థాన్‌లో విదేశీ కరెన్సీని ఉపయోగించడంపై తాలిబన్లు నిషేధం విధించారు. దీనికి సంబంధించి గత మంగళవారం (అక్టోబర్ 2,2021) ప్రకటించారు.తాలిబన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఇప్పటికే ఆర్థికంగా పలు ఇబ్బందుల్లో పడిన దేశం మరింతగా చిక్కుల్లో పడనుందని విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు. తాలిబన్లు ఆఫ్ఘన్‌ను స్వాధీనం చేసుకున్న తర్వాత ఆ దేశ కరెన్సీ అఫ్ఘాని విలువ క్షీణించింది. ఆ దేశ నిధులను విదేశాల్లో స్తంభింపజేశారు.
ఈక్రమంలో తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ..ఇకపై దేశీయ వ్యాపార, తదితర కార్యకలాపాల కోసం విదేశీ కరెన్సీని ఉపయోగిస్తే వారిపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. దేశ ఆర్థిక పరిస్థితి, దేశ ప్రయోజనాల దృష్ట్యా అఫ్ఘాన్లు అంత అఫ్గాని కరెన్సీని మాత్రమే ఉపయోగించాలని ఇది ప్రతీ నగదు లావాదేవీలోనూ ఉపయోగించాలని ప్రకటించారు. ఇకనుంచి అప్ఘాన్ ప్రజలంతా విదేశీ కరెన్సీ లావాదేవీలను ఆపివేయాలని హుకుం జారీ చేశారు.
కాగా ఇప్పటికే అఫ్గాన్ ప్రభుత్వ ఖజానా దాదాపు ఖాళీ అయిపోయింది. బ్యాంకుల్లో నగదు కొరత తీవ్రంగా ఉంది. పరిస్థితి ఇళా ఉంటే మరోవైపు అఫ్గాన్ లో తాలిబన్ల ప్రభుత్వాన్ని అంతర్జాతీయకంగా ఏ దేశం కూడా గుర్తించటంలేదు. పక్కనున్న పాకిస్థాన్ మాత్రం తన స్వార్థ ప్రయోజనాలకు తాలిబన్లకు భయపడి తందానా అని మాత్రం అంటోంది.
కాగా అఫ్గాన్ లో పలు లావాదేవీలు అమెరికన్ డాలర్లలో జరుగుతుంటాయి. అఫ్గాన్ లోని దాదాపు అన్ని మార్కెట్లలో US డాలర్ల వినియోగం విస్తృతంగా ఉంది, దక్షిణ సరిహద్దుల్లోని వాణిజ్య మార్గానికి సమీపంలో ఉన్న ప్రాంతాల్లో పాకిస్థానీ రూపాయలను ఉపయోగిస్తున్నారు. ఈక్రమంలో తాలిబన్లు ఇకనుంచి విదేశీ కరెన్సీని నిషేధిస్తున్నామని ఇక ప్రజలంతా అఫ్గాన్ కరెన్సీని మాత్రం వినియోగించుకోవాలని ప్రకటించింది.