కేరళ నుంచి ఎగిరిపోయిన ఎఫ్-35బీ యుద్ధ విమానం.. ఇన్ని రోజులు ఇక్కడ ఉన్నందుకు బ్రిటన్ ఎంత డబ్బు చెల్లించిందో తెలుసా?
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ యుద్ధ విమానం ఇన్ని రోజులు ఉన్నందుకుగానూ బ్రిటన్ ప్రభుత్వం భారీ స్థాయిలో రుసుము చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది.

బ్రిటన్‌కు చెందిన ఎఫ్-35బీ లైట్నింగ్ II స్టెల్త్ యుద్ధ విమానం కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి తిరిగి వెళ్లిపోయింది. కేరళలో అత్యవసరంగా దిగిన ఆ యుద్ధ విమానం 35 రోజులపాటు ఇక్కడే ఉండిపోయింది. మురమ్మతులు పూర్తయ్యాక వెళ్లింది.
తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆ యుద్ధ విమానం ఇన్ని రోజులు ఉన్నందుకుగానూ బ్రిటన్ ప్రభుత్వం భారీ స్థాయిలో రుసుము చెల్లించినట్లు ప్రచారం జరుగుతోంది.
పార్కింగ్ రుసుముగా రోజుకు రూ.26,261 వసూలు చేస్తారని మొదట వార్తలు వచ్చాయి. మొత్తం 35 రోజులకు రూ.9.19 లక్షల వరకు ఖర్చు అవుతుందని రిపోర్టులు వచ్చాయి. జూలై 6 తర్వాత హ్యాంగర్ వాడకానికి కూడా ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సేవల సంస్థ ఛార్జ్ వసూలు చేస్తుందని తెలుస్తోంది.
Also Read: యూకే-ఇండియా యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ 2025.. అప్లికేషన్ల గడువు ముగుస్తోంది..
విమానాశ్రయ వర్గాల సమాచారం ప్రకారం.. ఆ యుద్ధ విమానం మంగళవారం ఉదయం 10.15 గంటలకు ఉత్తర ఆస్ట్రేలియాలోని డార్విన్ వైపు ప్రయాణించింది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. యూకే నుంచి వచ్చిన ఇంజినీరింగ్ బృందం ఇక్కడే ఉంది. బుధవారం వారు వెళ్తున్నారు. మరమ్మత్తులు పూర్తైన తర్వాత యుద్ధవిమాన పైలట్ ఆదివారం తిరువనంతపురంకు చేరుకున్నారు. మంగళవారం ఆ యుద్ధ విమానం వెళ్లింది.
“పార్కింగ్, ల్యాండింగ్ కోసం విమానాశ్రయం సుమారు రూ.5 లక్షలు వసూలు చేసింది. అన్ని సౌకర్యాలు కల్పించినందుకు పైలట్ ప్రత్యేకంగా సిబ్బందిని అభినందించారు. విమానాశ్రయంలో నిర్వహించిన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్‌హాల్ సదుపాయం కోసం వసూలు చేసే రుసుము ఎయిర్ ఇండియా ప్రామాణిక నిబంధనల ప్రకారం ఉంటుంది” అని ఒక అధికారి తెలిపారు.