Amercia Bomb Cyclone : అమెరికా అల్లకల్లోలం.. అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న మంచు తుఫాన్, 34కి పెరిగిన మృతుల సంఖ్య

అమెరికా ఫ్రీజర్ గా మారింది. అవును, అగ్రరాజ్యం గడ్డ కట్టుకుపోయింది. మంచు తుపాను ఎఫెక్ట్ అమెరికాపైన అంతకంతకూ పెరుగుతోందే కానీ, తగ్గడం లేదు. బాంబ్ సైక్లోన్ తో అమెరికా అతలాకుతలం అవుతోంది. మృతుల సంఖ్య 34కి పెరిగింది.

Amercia Bomb Cyclone : అమెరికా అల్లకల్లోలం.. అగ్రరాజ్యాన్ని వణికిస్తున్న మంచు తుఫాన్, 34కి పెరిగిన మృతుల సంఖ్య

Updated On : December 26, 2022 / 6:44 PM IST

Amercia Bomb Cyclone : అమెరికా ఫ్రీజర్ గా మారింది. అవును, అగ్రరాజ్యం గడ్డ కట్టుకుపోయింది. మంచు తుపాను ఎఫెక్ట్ అమెరికాపైన అంతకంతకూ పెరుగుతోందే కానీ, తగ్గడం లేదు. బాంబ్ సైక్లోన్ తో అమెరికా అతలాకుతలం అవుతోంది. మృతుల సంఖ్య 34కి పెరిగింది.

ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు మైనస్ 50 డిగ్రీలకు పడిపోయాయి. నిరంతరాయంగా మంచు కురుస్తోంది. చలి గాలులతో ప్రజలు అల్లాడుతున్నారు. ఎముకలు కొరికే చలి ఎలా ఉంటుందో అమెరికన్లు అనుభవిస్తున్నారు. ప్రధాన నగరాల్లోనూ మైనస్ 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఇళ్లు, వీధులు తేడా తెలియడం లేదు. ఎక్కడ చూసినా మంచే. కొన్ని లక్షల ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Also Read..United States: అమెరికాలో మంచు తుపాన్ ధాటికి 18 మంది మృతి.. కరెంటు లేక చీకట్లోనే 17 లక్షల మంది

13 రాష్ట్రాలపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపుతోంది మంచు. మొత్తం అమెరికా జనాభాలో 60శాతం మందిపైన బాంబ్ తుపాను ఎఫెక్ట్ కనిపిస్తోంది. న్యూయార్క్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. బఫెలో సిటీపై ప్రభావం తీవ్రంగా ఉంది. బఫెలో సిటీలో 16శాతం మందికి కరెంట్ సప్లయ్ నిలిచిపోయింది. భారీగా మంచు పేరుకుపోవడంతో ఎమర్జెన్సీ బృందాలు అక్కడికి చేరుకోలేకపోతున్నాయి.

రోడ్లన్నీ మంచులో కూరుకుపోవడంతో వాహనాలు చిక్కుకుపోయాయి. ఆ వాహనాల నుంచి మృతదేహాలు వెలికితీశారంటే మంచు ఏ స్థాయిలో ప్రజల ప్రాణాలు తీస్తోందో అర్థం చేసుకోవచ్చు. బఫెలో ఎయిర్ పోర్టు ప్రాంతంలో 43 ఇంచుల మేర మంచు కురిసిందంటే ఏ స్థాయిలో హిమపాతం నమోదవుతోందో అర్థం చేసుకోవచ్చు.

Also Read..US Winter Storm: మంచు గుప్పిట్లోనే అమెరికా.. 26 మంది మృతి.. రహదారులపై పేరుకుపోయిన మంచు.. ఫొటోలు

క్రిస్మస్ వేడుకలపైనా బాంబ్ సైక్లోన్ ప్రభావం తీవ్రంగా పడింది. ప్రయాణాలు చేయలేక ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. డిసెంబర్ 21 నుంచి ఇప్పటిదాకా 12వేల విమానాలు రద్దయ్యాయి. కెనడాలోనూ ఇదే పరిస్థితి ఉంది. లక్ష 40వేల ఇళ్లకు పవర్ కట్ అయ్యింది. ఒంటారియో, క్యూబెక్ ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.