ఆడపిల్ల కోసం 14మంది మగపిల్లల్ని కన్న దంపతులు..!!

America : కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసి గర్భస్రావం చేయించుకునేవారు ఎంతోమంది. ఆడపిల్ల పుడితే పురిటిలోనే చంపేసేవారు ఇంకొందరు. చెత్తకుప్పల్లోను..ముళ్లపొదల్లోనే పడేసి వదిలించుకునేవారు మరికొందరు. ఆడపిల్ల అంటే ఖర్చు అని దండగ అని భావించే ఈరోజు ‘‘ఆడపిల్ల కోసం ఒకరు ఇద్దరూ ముగ్గురు కాదు ఏకంగా 14మంది మగపిల్లల్ని’’ కన్న దంపతుల గురించి తెలుసుకోవాల్సిందే..
అమెరికాలోని మిచిగాన్‌కు చెందిన జాయ్, కతేరి దంపతులకు గురువారం (నవంబర్ 5,2020) పండండి ఆడబిడ్డ జన్మించింది. ఆ బిడ్డను చూసిన వారి ఆనందం అంతా ఇంతా కాదు..ప్రపంచాన్ని జయించినంత సంబరపడిపోతున్నారు.
https://10tv.in/love-couple-commits-suicide-girl-killed-boy-in-critical-condition/
ఆడపిల్ల అంటే ఎంతో ఇష్టపడేవారికి వరుసగా మగపిల్లలు పుట్టారు. అలా 14మంది మగపిల్లలు పుట్టారు. కానీ ఆడపిల్ల కావాలనే వారి కోరిక మాత్రం తీరలేదు. దీంతో ఆడపిల్ల పుట్టేదాకా ఎంతమంది మగపిల్లలైనా కనాలని నిర్ణయించుకున్నారు. అలా ఇప్పటివరకూ 14మంది మగపిల్లలు పుట్టినా వారు ఈసారైనా ఆడపిల్ల పుట్టకపోతుందా? అని గంపెడు ఆశతో ఎదురు చూశారు.
వారి ఎదురు చూపులు ఫలించాయి. 15వ ప్రసవంలో వారి ఆశించినట్లుగానే ఆడపిల్ల పుట్టింది. ఆ బిడ్డను చూసిన ఆ దంపతులు ఆనందం మిన్నంటింది. అలాగే తమ చిన్నారి ‘‘చిట్టి చెల్లెల్ని’’చూసిన ఆ 14మంది అన్నదమ్ములు నిన్ను కాలు కింద పెట్టకుండా మా గుండెలపై నడిపిస్తాం చెల్లీ అంటూ తెగ మురిసిపోతున్నారు. ఆ పాపకు ‘‘మ్యాగీ’’అని పేరు పెట్టుకుని 24గంటలూ ఆ పాపతోనే ఆటలు..పాటలు…
ఆడపిల్ల పుట్టిన సంబరాల్లో మునిగిపోయిన జాయ్, కతేరి దంపతులు మాట్లాడుతూ..మా కలలు ఫలించాయి. మాకు ఆడబిడ్డ పుట్టింది. చాలా చాలా ఆనందంగా ఉంది. మా పాప పుట్టినప్పుడు 3.4 కేజీల బరువుతో జన్మించిందనీ..మా బంగారుతల్లికి 14 మంది అన్నలు ఉన్నారు అంటూ ఎంతో మురిపెంగా చెప్పారు.
తమ కుటుంబంలోకి మ్యాగీ రావడం ఎంతో సంతోషంగా ఉందనీ..ఈ సంవత్సరం తమ జీవింతంలో ఎప్పటికీ మరచిపోలేనదనీ సంబరంగా చెప్పారు. మ్యాగీ తమకు దేవుడిచ్చి గొప్ప బహుమతి అని తెలిపారు.
కాగా..జాయ్, కతేరి దంపతులకు 1993లో వివాహమైంది. వీళ్ల పెద్ద కొడుకుకు ఇప్పుడు 28 ఏళ్లు. అతని పేరు టేలర్ కు ఇటీవలే ఎంగేజ్ మెంట్ కూడా అయ్యింది. తన పెళ్లిలో తన చిన్నారి చిట్టిచెల్లే ఎట్రాక్షన్ అంటున్నాడు టేలర్ తన చెల్లిని చూసి మురిసిపోతూ..