US Visas: భారతీయులకు తీపికబురు చెప్పిన అమెరికా..
భారత్ - అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు అమెరికాలో గొప్ప మద్దతు ఉందని దక్షిణ మరియు మధ్య ఆసియా కోసం యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డొనాల్డ్ లూ అన్నారు.

US Indian student visa
US Visas: భారతీయులకు అగ్రరాజ్యం అమెరికా తీపికబురు చెప్పింది. ప్రతీయేటా భారతదేశం నుంచి అమెరికా వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారతీయ విద్యార్థుల సంఖ్య ఎక్కువే. అయితే వీసాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో వీరందరికీ అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది. ఈ ఏడాది ఇండియాకు చెందినవారికి రికార్డు స్థాయిలో 10లక్షలకుపైగా వీసాలను జారీ చేయనున్నట్లు అమెరికా తెలిపింది. అంతేకాకుండా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే భారతీయ విద్యార్థులందరికీ స్టూడెంట్ వీసాల ఆమోద ప్రక్రియను పూర్తిచేస్తామని చెప్పింది. డేటా ప్రకారం.. యునైటెడ్ స్టేట్స్ కు వెళ్లే అంతర్జాతీయ విద్యార్థుల విషయంలో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచింది.
Amritpal Singh: ఎట్టకేలకు దొరికాడు..! అమృత్ పాల్ సింగ్‌ను అరెస్టు చేసిన మోగా పోలీసులు
దక్షిణ మరియు మధ్య ఆసియా కోసం యూఎస్ అసిస్టెంట్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ డొనాల్డ్ లూ మాట్లాడుతూ.. భారత్ – అమెరికా ద్వైపాక్షిక సంబంధాలకు అమెరికాలో గొప్ప మద్దతు ఉందని అన్నారు. భారతీయులు వర్క్ వీసాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. H-1B వీసా, L వీసాలు భారతదేశం నుంచి ఐటీ నిఫుణులు ఎక్కువగా కోరుకునేవి. ముఖ్యంగా H-1B వీసా, వలసేతర వీసా, యూఎస్ కంపెనీలు ప్రత్యేక వృత్తుల్లో విదేశీ ఉద్యోగులను నియమించుకోవడానికి అనుమతిస్తుంది. భారత్, అమెరికాల ఆర్థిక వ్యవస్థలకు కీలకమైన వర్క్ వీసాలకు మేం ప్రాధాన్యం ఇస్తున్నామని డొనాల్డ్ లూ అన్నారు.
Tollywood : ఇండియన్ సినిమాకి పాన్ గ్లోబల్ ఇమేజ్ తెచ్చింది టాలీవుడ్.. నేపాలీ సూపర్ స్టార్!
వీటి జారీకి భారత్‌లోని కొన్ని కాన్సులేట్‌లలో 60 రోజుల కన్నా తక్కువ సమయమే పడుతోందని చెప్పారు. అయితే, కొన్ని నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల రెన్యూవల్‌కు పిటిషన్ దారు స్వయంగా హాజరు కావాల్సి ఉండగా, ఇలాంటి వాటిని దేశీయంగానే పునరుద్దరించే ప్రక్రియను ఈ ఏడాది చివర్లో ప్రయోగాత్మకంగా తిరిగి అమలు చేయాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు. ఈ వేసవిలో పాఠశాలలు ప్రారంభమయ్యే సమయానికి భారతీయులకోసం అన్ని విద్యార్థి వీసాలను ప్రాసెస్ చేసేలా యూఎస్ కట్టుబడి ఉందని లూ చెప్పారు.