America New Rule: వీసా ఫ్రీ టూరిస్టులకు అమెరికా బిగ్ షాక్..! వారికి కొత్త నిబంధన..! ఇకపై అది తప్పనిసరి..!
ఈ ప్రతిపాదనలకు సంబంధించి అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (CBP) తాజాగా పబ్లిక్ నోటీస్ జారీ చేసింది.
America New Rule: తమ దేశానికి వచ్చే వీసా ఫ్రీ టూరిస్టులకు అగ్రరాజ్యం అమెరికా బిగ్ షాక్ ఇవ్వబోతోంది. టూరిస్టులపై నిఘా పెంచేందుకు రెడీ అవుతోంది. ఇందులో భాగంగా కొత్త నిబంధన తీసుకురానుంది. యూఎస్ లోకి వచ్చే పర్యాటకుల్లో కొందరు దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా గత ఐదేళ్ల సోషల్ మీడియా హిస్టరీని అందించడాన్ని తప్పనిసరి చేసే యోచనలో ట్రంప్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా, జర్మనీ, జపాన్, యూకే, ఇజ్రాయల్, సౌత్ కొరియా.. ఇలా వీసా అవసరం లేని 42 దేశాల టూరిస్టులకూ ఈ నిబంధన వర్తింపజేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. 90 రోజుల పాటు ఉండాలని అనుకునే టూరిస్టులు, బిజినెస్ ట్రావెలర్స్ కు ఈ కొత్త నిబంధన వర్తింపజేయనున్నారు.
ఈ ప్రతిపాదనలకు సంబంధించి అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ (CBP) తాజాగా పబ్లిక్ నోటీస్ జారీ చేసింది. వీటిపై 60 రోజుల్లో తమ అభిప్రాయాలను తెలియజేయాలంది. ఈ ప్రతిపాదనలు ఫైనల్ కాదని ఇందులో కొన్ని మార్పులు ఉండొచ్చని తెలిపింది.
”సోషల్ మీడియా చెకింగ్ తప్పనిసరి డేటా ఎలిమెంట్. దరఖాస్తుదారుల నుంచి సోషల్ మీడియా హిస్టరీతోపాటు గత పదేళ్లుగా ఉపయోగిస్తున్న ఈ-మెయిల్, గత ఐదేళ్లలో ఉపయోగించిన ఫోన్ నెంబర్లు, కుటుంబ సభ్యుల పేర్లు, ఇతర డేటాను సేకరిస్తాం. వీటితోపాటు స్క్రీనింగ్ ప్రక్రియలో భాగంగా సెల్ఫీలను అప్‌లోడ్ చేయాల్సి ఉండే అవకాశం ఉంది” అని సీబీపీ తెలిపింది.
‘UK, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియాతో సహా 42 వీసా మినహాయింపు దేశాల నుండి వచ్చే సందర్శకులకు కఠినమైన ప్రవేశ నిబంధనలను యునైటెడ్ స్టేట్స్ ప్రతిపాదిస్తోంది. ESTA వ్యవస్థను ఉపయోగించే ప్రయాణికులు త్వరలో ఐదు సంవత్సరాల వరకు సోషల్ మీడియా కార్యకలాపాలు, ఇమెయిల్ ఖాతాలు, ఫోన్ నంబర్లు, కుటుంబ సమాచారం, వేలిముద్రలు, DNA, ఐరిస్ స్కాన్ వంటి బయోమెట్రిక్ డేటాను బహిర్గతం చేయాల్సి ఉంటుంది. జాతీయ భద్రతను పెంచేడమే దీని లక్ష్యం. దీనిపై 60 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తాం’ అని సీబీపీ వెల్లడించింది.
