Air India Flight Fire : ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.

Air India Flight Fire : ఎయిర్ ఇండియా విమానంలో మంటలు

Air India flight

Updated On : February 3, 2023 / 1:49 PM IST

Air India flight fire : ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది. విమానం గాలిలో ఉండగా ఒక్కసారిగా ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. దీంతో అప్రమత్తమైన పైలట్ విమానాన్ని వెంటనే వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు. దీంతో విమానంలోని ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

వివరాళ్లోకి వెళ్తే.. ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం శుక్రవారం ఉదయం అబుదాబి నుంచి కేరళలోని కాలికట్ (కోజికోడ్)కు బయల్దేరింది. టేకాఫ్ అయిన విమానం వెయ్యి అడుగుల ఎత్తులో ఉండగా ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఇంజిన్ లో మంటలు చెలరేగాయి.

IndiGo Aircraft: టేకాఫ్ సమయంలో ఇండిగో విమానంలో మంటలు.. తప్పిన పెను ప్రమాదం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు

అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి అబుదాబి విమానాశ్రయంలో సుక్షితంగా ల్యాండ్ చేశారని సంబంధిత అధికారులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారని.. వారందరూ సురక్షితంగా ఉన్నారని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారులు తెలిపారు.