Scotland : 5000 ఏళ్ల నాటి పురాతన సమాధి.. 14 అస్థిపంజరాలను కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు
డీఎన్ఏ, ఐసోటోప్ విశ్లేషణ ద్వారా వారి గురించి తెలుసుకుంటామని తెలిపారు. కాగా, స్థానిక వాలంటీర్లు, సెంట్రల్ లంకేషైర్ వర్సిటీకి చెందిన విద్యార్థులతో కలిసి కుండలు, రాతి పనిముట్లు, ఎముక వస్తువులు వంటి వాటిని కూడా ఈ పెద్ద సమాధిలో కనుగొన్నారు.

old tomb skeletons
Scotland Old Tomb Skeletons : 5000 ఏళ్ల నాటి పురాతన సమాధిలో 14 అస్థిపంజరాలను పురావస్తు నిపుణులు కనుగొన్నారు. స్త్రీ, పురుషులతోపాటు పిల్లలకు చెందినవిగా వెల్లడించారు. అలాగే రాతి యుగానికి చెందిన కొన్ని వస్తువులు కూడా ఈ తవ్వకాల్లో బయటపడ్డాయని పేర్కొన్నారు. స్కాట్లాండ్ లోని ప్రధాన ఓర్కినీ ద్వీపంలోని హోల్క్ లో ఇవి బయటపడ్డాయి. నేషనల్ మ్యూజియమ్స్ స్కాట్లాండ్, కార్డిఫ్ విశ్వ విద్యాలయం నిపుణుల సహకారంతో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు.
నియోలిథిక్ సైట్ ప్రాంతంలో 5000 ఏళ్ల నాటి పెద్ద సమాధిని గుర్తించారు. శిథిలావస్థలో ఉన్న ఈ సమాధిలో 14 అస్థిపంజరాలు ఉన్నాయని పేర్కొన్నారు. డీఎన్ఏ, ఐసోటోప్ విశ్లేషణ ద్వారా వారి గురించి తెలుసుకుంటామని తెలిపారు. కాగా, స్థానిక వాలంటీర్లు, సెంట్రల్ లంకేషైర్ వర్సిటీకి చెందిన విద్యార్థులతో కలిసి కుండలు, రాతి పనిముట్లు, ఎముక వస్తువులు వంటి వాటిని కూడా ఈ పెద్ద సమాధిలో కనుగొన్నారు.
Ground Water : భారతదేశంలో భూగర్భజలాల క్షీణతపై ఐక్యరాజ్యసమితి సంచలన నివేదిక
నేషనల్ మ్యూజియమ్స్ స్కాట్లాండ్ కు చెందిన డాక్టర్ హ్యూగో ఆండర్సన్, వైమార్క్, కార్డిఫ్ ప్రొఫెసర్ విక్కీ కమ్మింగ్స్ నేతృత్వంలో మూడు వారాలపాటు ఇక్కడ జరిగాయి. 15 మీటర్ల వ్యాసం కలిగిన రాతి కట్టడం, 7 మీటర్ల పొడవు ఉన్న మార్గాన్ని కనుగొన్నారు. రాత్రి కట్టడం మధ్యలో ఒక రాతి గది ఉందని, దీని చుట్టూ ఆరు చిన్నవి ఉన్నాయని పురావస్తు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.