China : అరెస్టైన హంతకుడు.. భార్యను మళ్లీ పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు
30 ఏళ్ల క్రితం ఓ హత్య కేసులో నిందితుడుగా ఉన్నాడు. ఇన్ని సంవత్సరాలు తప్పించుకుని తిరిగాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. భార్యకు వీడ్కోలు చెప్పే సమయంలో వెక్కి వెక్కి ఏడ్చాడు. ఆమెను మళ్లీ పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చాడు.

China
China : 30 ఏళ్ల క్రితం కేసులో హంతకుడిని చైనాలో అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది. హంతకుడు జైలుకి వెళ్తూ భావోద్వేగానికి గురయ్యాడు. తన కోసం ఎదురుచూడొద్దని.. మళ్లీ పెళ్లి చేసుకోమని భార్యకు చెప్పడం ఆశ్చర్యం కలిగించింది.
Man Eat Wife Brain : మెక్సికోలో దారుణం.. భార్యను హత్య చేసి ఆమె మెదడును తిన్న భర్త
1993లో సెంట్రల్ హుబీ ప్రావిన్స్‌లో ఒక హత్య జరిగింది. ముగ్గురు కలిసి ఒక వ్యక్తిని కత్తితో పొడిచి చంపారు. ఆ ముగ్గురిలో తాను ఉన్నట్లు ఒప్పుకున్నాడు జౌ అనే వ్యక్తి. నేరం జరిగిన వెంటనే అందరూ పట్టుబడ్డా జౌ మాత్రం తప్పించుకుని తిరిగాడు. అతను దాక్కున్న సౌత్ చైనాలోని గ్వాంగ్ జౌలో హుబే పోలీసులు అతడిని అరెస్టు చేసారు. జైలుకి బయలుదేరే సమయంలో వీడ్కోలు చెప్పేందుకు జౌ తన భార్యను కౌగిలించుకుని ఏడ్చాడు. ‘విడాకుల అగ్రిమెంట్ అయిపోయింది.. ఆమెతో సంతకం పెట్టించండి.. అమెను మళ్లీ పెళ్లి చేసుకునేలా ఒప్పించండి.. నా కోసం ఎదురుచూడకండి.. నేను జైలు నుంచి బయటకు రాలేదు’ అంటూ తన కుటుంబ సభ్యులతో భావోద్వేగంతో మాట్లాడాడట.
Woman Killed : బీహార్ లో మహిళ దారుణ హత్య… కనుగుడ్లు పెకిలించి, నాలుక కోసి, ప్రైవేట్ భాగాలు ఛిద్రం
జౌ భార్య అతని సలహాను ఒప్పుకోనంటూ కన్నీళ్లు పెట్టుకుందట. జౌ 30 ఏళ్ల క్రితం తాను చేసిన నేరానికి పశ్చాత్తాప పడ్డాడట. తాను తల్లితండ్రుల్నిఎప్పుడూ సరిగా చూసుకోలేకపోయానని చిన్నతనంలో తప్పు చేశానని ఆ వ్యక్తిని కొట్టి చంపి ఉండకూడదని జౌ చెప్పాడట. ఇంత పెద్ద నేరం చేసి ఇన్ని సంవత్సరాలు పోలీసుల కళ్లు కప్పి తిరిగాడంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తోంది.