సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘George Floyd Challenge’ హ్యాష్ ట్యాగ్ 

  • Published By: srihari ,Published On : June 5, 2020 / 07:38 AM IST
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ‘George Floyd Challenge’ హ్యాష్ ట్యాగ్ 

Updated On : June 5, 2020 / 7:38 AM IST

నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణంతో అమెరికా అట్టుడుకుతోంది. తెల్ల పోలీసు అధికారి జార్జ్ ఫ్లాయిడ్ మెడపై కాలి పెట్టడంతో ఊపిరాడక మరణించినట్టు అమెరికా వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పోలీసు కస్టడీలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి ఘటనపై తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికాలో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో జార్జ్ ఫ్లాయిడ్ ఛాలెంజ్ ఒకటి ట్రెండ్ అవుతోంది. జార్జ్ ఘటనను అనుకరిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. జార్జ్ మెడపై కాలి పెట్టి చంపిన పోలీసు అధికారిలా అనుకరిస్తూ ‘George Floyd Challenge’ పేరుతో హ్యాష్ ట్యాగ్ జత చేస్తూ ఆన్ లైన్‌లో పోస్టులు చేస్తున్నారు. ఈ ఛాలెంజ్ లో చాలామంది సోషల్ యూజర్లు పాల్గొంటున్నారు. 

ఫొటోలు, వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ అన్ని సోషల్ ప్లాట్ ఫాంల్లో George Floyd Challenge హ్యాష్ టాగ్ బాగా ట్రెండ్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్ ఫాంల్లో కమ్యూనిటీ స్టాండర్డ్స్ ఉల్లంఘించడంతో ఈ హ్యాష్ ట్యాగ్ ను బ్లాక్ చేశాయి కంపెనీలు. ఆన్ లైన్ ప్లాట్ ఫాంల్లో ఇతర సోషల్ యాప్స్ లోనూ జార్జ్ ఫ్లాయిడ్ ఛాలెంజ్ కు సంబంధించి పోస్టులను డిలీట్ చేయాల్సిందిగా ఆన్ లైన్ పిటిషన్ దాఖలైంది.

దాంతో టిక్ టాక్ సహా అన్ని ప్లాట్ ఫాంల్లో #George Floyd Challenge కు సంబంధించి ఫొటోలు, వీడియోలను తొలగించారు. ఎవరైనా యూజర్లు ఈ హ్యాష్ ట్యాగ్ తో సెర్చ్ చేస్తే పోలీసుల చర్యను ఖండిస్తు నిరసన చేస్తున్న వీడియోలు మాత్రమే కనిపిస్తున్నాయి.

Read:  న్యూజిలాండ్ బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ పంపిణీ : ప్రధాని జసిందా ఆర్డెర్న్