Artemis 1: మూన్ మిషన్ ప్రయోగానికి రెండోసారి ఆటంకం.. ప్రయోగానికి ముందు ఇంధనం లీక్

సూర్యోదయం సమయంలో ఒవర్ ప్రజెర్ అలారం మోగిందని, అనంతరం ట్యాంకింగ్ ఆపరేషన్ నిలిపివేయబడిందని సమాచారం. అయితే ఎటువంటి నష్టం లేకుండా మరోసారి ప్రారంభించడానికి ప్రయత్నించారని నాసా లాంచ్ కంట్రోల్ నివేదించింది. కానీ నిమిషాల్లోనే రాకెట్ దిగువన ఉన్న ఇంజిన్ విభాగం నుంచి హైడ్రోజన్ ఇంధనం లీక్ అవ్వడం ప్రారంభమైందట. దీంతో ఆపరేషన్ నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది.

Artemis 1: మూన్ మిషన్ ప్రయోగానికి రెండోసారి ఆటంకం.. ప్రయోగానికి ముందు ఇంధనం లీక్

Artemis 1 moon mission rocket hit by fuel leak before 2nd launch attempt

Updated On : September 3, 2022 / 7:21 PM IST

Artemis 1: నాసా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన అర్టెమిస్ 1 ప్రయోగానికి మరోసారి ఆటంకం ఎదురైంది. దీంతో మూన్ మిషన్ ప్రయోగం రెండోసారి కూడా వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. మొదటిసారి ప్రయోగానికి ముందు ఆగస్టు 30న సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయోగాన్ని ఈరోజున చేపట్టాలని నిర్ణయించారు. అయితే ఈసారి ఇంధనం లీక్ కావడంతో ప్రయోగం మళ్లీ వాయిదా పడుతుందని అంటున్నారు. కాగా, 322 అడుగుల ఈ రాకెట్‭ను ప్రయోగానికి సన్నాహక పనులు చేపడుతున్న క్రమంలో ఒక మిలియన్ గ్యాలెన్ల ఇంధనాన్ని నింపినట్లు నాసా ఒక ప్రకటనలో పేర్కొంది.

సూర్యోదయం సమయంలో ఒవర్ ప్రజెర్ అలారం మోగిందని, అనంతరం ట్యాంకింగ్ ఆపరేషన్ నిలిపివేయబడిందని సమాచారం. అయితే ఎటువంటి నష్టం లేకుండా మరోసారి ప్రారంభించడానికి ప్రయత్నించారని నాసా లాంచ్ కంట్రోల్ నివేదించింది. కానీ నిమిషాల్లోనే రాకెట్ దిగువన ఉన్న ఇంజిన్ విభాగం నుంచి హైడ్రోజన్ ఇంధనం లీక్ అవ్వడం ప్రారంభమైందట. దీంతో ఆపరేషన్ నిలిపివేసినట్లు నాసా ప్రకటించింది.

Loan App Scams ED Search : లోన్‌యాప్స్ ఆగడాలపై ఈడీ దూకుడు..18 చోట్ల సోదాలు..రూ.17 కోట్లు సీజ్

అర్టెమిస్ అంటే..? ఈ ప్రయోగం దేనికి..?
చంద్రుడిపై మనిషి అడుగుపెట్టిన యాబై ఏళ్ల తర్వాత తిరిగి చంద్రుడి మీదకు మనుషులను పంపించే ప్రయోగాలకు తాజాగా నాసా శ్రీకారం చుట్టింది. ఈసారి ఈ ప్రయోగాలకు ‘ఆర్టెమిస్’ అని పేరు పెట్టింది. గ్రీకు పురాణగాథల ప్రకారం ఆర్టెమిస్ అంటే ఒక చంద్ర దేవత అని అర్థం. అందులో భాగంగా ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ‘ఆర్టెమిస్ 1’ ప్రయోగాన్ని ప్రారంభిస్తోంది. ఇందులో మనుషులెవరినీ పంపించకుండా కొత్త రాకెట్, కొత్త స్పేస్‌క్రాఫ్ట్‌ల పనితీరును, వాటి భద్రతను, సాంకేతిక పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు.

ఈ ప్రయోగం అనంతరం 2024లో ‘ఆర్టెమిస్-2’ ప్రయోగం చేపట్టాలని నాసా నిర్ణయించుకుంది. అందులో వ్యోమగాములను స్పేస్‌క్రాఫ్ట్‌లో అంతరిక్షంలోకి పంపిస్తారు. కానీ వారు చంద్రుడి మీద దిగకుండా వ్యోమగాముల అంతరిక్ష ప్రయాణానికి ఈ స్పేస్‌క్రాఫ్ట్ ఎంతవరకు అనుకూలంగా ఉంటుందనే అంశాలను మాత్రమే పరిశీలిస్తారు. ఈ రెండు ప్రయోగాల ముగిశాక 2025లో ‘ఆర్టెమిస్-3’ ప్రయోగం చేపడతారు. ఈ ప్రయోగంలో వ్యోమగాములను చంద్రుడి మీదకు పంపిస్తారు. 2030ల నాటికి అంగారకుడి మీదకు అంతరిక్షయాత్రికులను పంపించటానికి సంసిద్ధమయ్యే క్రమంలో భాగంగా నాసా ఈ మూన్ మిషన్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు కనిపిస్తోంది.

NDLS: న్యూఢిల్లీ కొత్త రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో తెలుసా? ఫొటోలు విడుదల చేసిన ప్రభుత్వం