China Cloud Burst : చైనా చేతిలో ఆర్టిఫిషియల్ క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీ?
క్లౌడ్ బరస్ట్ అనే పదం వినిపించగానే అందరి దృష్టి డ్రాగన్ కంట్రీ చైనాపై పడింది. చైనా చేతిలో ఆర్టిఫిషియల్ క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీ ఉందనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తాయి.(China Cloud Burst)

Cloud Burst
China Cloud Burst : గోదావరి వరదలపై అధికారులతో సమీక్ష సందర్భంగా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. భారీ వర్షాలకు, ఆకస్మిక వరదలకు క్లౌడ్ బరస్ట్ ఓ కారణం కావొచ్చనే అనుమానం వ్యక్తం చేశారు కేసీఆర్. దీని వెనుక విదేశీ కుట్రకు ఛాన్స్ ఉందన్నారు. గతంలో లేహ్, ఉత్తరాఖండ్ లోనూ ఇదే విధంగా క్లౌడ్ బరస్ట్ చేశారన్న విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు. ఇప్పుడు గోదావరి పరివాహక ప్రాంతాల్లోనూ క్లౌడ్ బరస్ట్ చేస్తున్నట్టు సమాచారం ఉందంటున్నారు కేసీఆర్.
సీఎం కేసీఆర్ చేసిన సంచలన వ్యాఖ్యలతో ఇప్పుడు అందరి చూపు క్లౌడ్ బరస్ట్ పై పడింది. అసలేంటీ క్లౌడ్ బరస్ట్. వరద విలయాన్ని కృతిమంగా సృష్టించవచ్చా? గతంలో ఇలాంటి ఘటనలు ఎక్కడెక్కడ జరిగాయి? క్లౌడ్ బరస్ట్ తో మనపై కుట్రలు చేయాల్సిన అవసరం ఎవరికి ఉంది?(China Cloud Burst)
Cloudburst : సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన క్లౌడ్ బరస్ట్ అంటే …..
500 ఏళ్లలో ఎప్పుడూ లేనంతగా కడెం ప్రాజెక్ట్ క్యాచ్ మెంట్ ఏరియాలో 30 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కలలో కూడా ఊహించనంత వరద ప్రాజెక్ట్ కి పోటెత్తింది. కేసీఆర్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. కచ్చితంగా దీని వెనుక ఏదో ఒక కుట్ర దాగుండే అవకాశం ఉందంటున్నారు.
ఒక చిన్న ప్రాంతంలో ఒక గంటలో పది సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే దాన్ని మేఘాల విస్పోటనం లేదంటే క్లౌడ్ బరస్ట్ గా పిలుస్తారు. అంతేకాదు ఒకేసారి ఒకే ప్రాంతంలో ఒకటి కన్నా ఎక్కువ సార్లు క్లౌడ్ బరస్ట్ సంభవించే అవకాశం ఉంది. అలాంటిది జరిగితే తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 2013లో ఉత్తరాఖండ్ లో వరదలు పోటెత్తడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది. దీనికి కూడా క్లౌడ్ బరస్ట్ కారణం అన్న అనుమానాలు ఉన్నాయి.
CM KCR : సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు.. ఆకస్మిక వరదల వెనుక విదేశీ కుట్ర
అదే సమయంలో కుంభవృష్టి కురిసిన ప్రతీసారి దాన్ని క్లౌడ్ బరస్ట్ అని చెప్పలేము. రుతుపవనాలు అరేబియా సముద్రం నుంచి తేమను తీసుకొస్తాయి. వెస్ట్రన్ డిస్ట్రబెన్స్ కారణంగా మధ్యదరా తీరం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమాన పాకిస్తాన్, ఇరాన్, అప్ఘానిస్తాన్ నుంచి తేమను తీసుకొస్తాయి. ఈ రెండూ ఢీకొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రత కలిగుంటాయి. ఈ రెండూ ఢీకొన్నప్పుడు కురిసే వర్షం అంచనాలకు అందకుండా ఉంటుంది. సాధారణంగా అయితే పర్వత ప్రాంతాల్లో ఎక్కువగా క్లౌడ్ బరస్ట్ కు అవకాశం ఉంటుంది.
కొండలపై ఏర్పడిన మేఘాలు అధిక తేమను కలిగి తక్కువ సమయంలోనే కుండపోత వానలు కురిపిస్తాయి. సాధారణంగా రుతుపవనాలు వచ్చే ముందు ఇలాంటి భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మే నుంచి జులై, ఆగస్టు వరకు మన దేశంలోని ఉత్తర ప్రాంతాల్లో ఇలాంటి వాతావరణ పరిస్తితులు కనిపిస్తాయి. దక్షిణ భారత దేశంలో ఇలాంటి ఘటనలకు అవకాశమే లేదు. కానీ, కృతిమంగా క్లౌడ్ బరస్ట్ చేయాలని చూస్తే మాత్రం కచ్చితంగా ఇది సాధ్యమే. ఇప్పుడు సీఎం కేసీఆర్ చేస్తున్న సందేహం కూడా ఇదే.
కాగా.. క్లౌడ్ బరస్ట్ అనే పదం వినిపించగానే అందరి దృష్టి డ్రాగన్ కంట్రీ చైనాపై పడింది. చైనా చేతిలో ఆర్టిఫిషియల్ క్లౌడ్ బరస్ట్ టెక్నాలజీ ఉందనే ఆరోపణలు మరోసారి వెల్లువెత్తాయి. 2008లో బీజింగ్ ఒలింపిక్స్ కు ఆర్టిఫిషియల్ రెయిన్ కురిసింది. ఇక మన దేశంలో ఉత్తరాఖండ్ వరదలకు చైనానే కారణం అనే వాదనలూ ఉన్నాయి.